మాతృదేవోభవ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
కొన్ని సినిమాలు ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతాయి. సినిమా ఉన్నంతకాలం ఆ సినిమా గురించి కొంత మంది మాట్లాడుతూనే ఉంటారు.;
కొన్ని సినిమాలు ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతాయి. సినిమా ఉన్నంతకాలం ఆ సినిమా గురించి కొంత మంది మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి అతి తక్కువ సినిమాలలో నాజర్, మాధవి కలిసిన నటించిన మాతృదేవోభవ సినిమా ఒకటి.
కన్నీళ్లు చాలా విలువైనవి అని చెబుతుంటారు. కానీ మాతృదేవోభవ లాంటి సినిమాలకు ఆ కన్నీళ్లను ఖర్చు పెట్టొచ్చు. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాలో నటి మాధవి నటించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ప్రస్తుతం మాధవి సినిమాల్లో కనిపించడం మానేశారు. కానీ ఒక్కసారిగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
కేవలం మాతృదేవోభవ సినిమా మాత్రమే కాకుండా, మరో చరిత్ర', 'ఖైదీ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య', సినిమాలు కూడా విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చాయి.
తన అభినయంతో, అందంతో 80, 90వ దశకంలో దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. కెరీర్ తారాస్థాయిలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె, ప్రస్తుతం తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా మాధవికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే ఈ ఫోటోలలో భర్తతో కలిసి కనిపించిన మాధవి.. పెళ్లి జరిగి 30 ఏళ్లయిన ఇంకా భర్తతో డేటింగ్ లో ఉన్నాను అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఇకపోతే ఈ ఫోటోలలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది మాధవి. జుట్టు క్రాఫ్ తో కనిపించిన ఈమె కాస్త బరువు పెరిగినట్టు కూడా కనిపించడంతో మాధవిని గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలా దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది మాధవి. ప్రస్తుతం మాధవికి సంబంధించిన ఈ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రీ ఎంట్రీ ఇస్తారా?
ప్రస్తుత కాలంలో చాలా మంది దర్శకులు సినిమాలో కొత్తదనం తీసుకురావడానికి పాత నటులను ఎంపిక చేసి మరి సినిమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. చాలామంది పాతతరం హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదిస్తున్నారు.
కేవలం హీరోయిన్లు మాత్రమే కాకుండా అప్పటి హీరోలు కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాలు చేస్తున్నారు. అప్పటి హీరో జగపతిబాబు ఇప్పుడు విలన్ గా తన ప్రతిభను చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరోవైపు శ్రీకాంత్ కూడా విలన్ గా మారిపోయారు. వీరిద్దరే కాకుండా అటు జెనీలియా, ఆమని, రమ్యకృష్ణ లాంటి ఎంతోమంది రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇకపోతే ఇప్పుడు వైరల్ అవుతున్న మాధవి ఫోటోలను చూసి మళ్లీ మాధవిని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకులు తీసుకొస్తారేమో చూడాలి. అయితే అసలు మాధవికి మళ్లీ సినిమాల్లో నటించాలి అనే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఏది ఏమైనా మాధవి మళ్లీ రీఎంట్రీ ఇస్తే చూడాలి అని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.