ట్రెండింగ్: మన హీరోల మాస్ లుంగీ మాయ!
పవన్ కళ్యాణ్ ఇటీవల 'భీమ్లా నాయక్' సినిమాలో లుంగీలో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే;
మన టాలీవుడ్ స్టార్ హీరోలంతా క్లాస్ లుక్ నుంచి మళ్లీ మాస్ లుక్ లోకి వచ్చేసారు. తమ రాబోయే సినిమాల్లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకోబోతున్నారు. ఇదే మాస్ లుక్ లో మరో కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అదే లుంగీ కట్టు. ప్రస్తుతం ఈ ట్రెండ్ ని స్టార్ హీరోలు తెగ ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు తమ అప్ కమింగ్ సినిమాల్లో లుంగీ కట్టుతో ఫ్యాన్స్ ని ఆకట్టుకోబోతున్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల 'భీమ్లా నాయక్' సినిమాలో లుంగీలో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలో పంచ కట్టుతో ఆకట్టుకోగా ఈసారి సంక్రాంతికి రాబోతున్న 'నాసామిరంగ' సినిమాలో మాస్ అవతార్ లో కనిపించడంతోపాటు సినిమా అంతా లుంగీకట్టులోనే కనిపిస్తారట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' లో ఊర మాస్ రోల్ చేస్తున్నారు.
వింటేజ్ మహేష్ ని తలపించేలా త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కంప్లీట్ మాస్ గా తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ లో మహేష్ మాస్ లుక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి అందులో మహేష్ లుంగీకట్టులో ఉన్న పోస్టర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. అప్పుడెప్పుడో 'శ్రీమంతుడు' సినిమాలో లుంగీ కట్టిన మహేష్ మళ్లీ ఇన్నాళ్లకు 'గుంటూరు కారం' లో లుంగీ కట్టుకొని ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు.
ఇక మహేష్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు తారక్ నటిస్తున్న 'దేవర' మూవీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో తారక్ లుంగీ కట్టుకొని కనిపించిన విషయం తెలిసిందే. దీన్నిబట్టి దేవరలో కూడా ఎన్టీఆర్ కొన్ని సన్నివేశాల్లో లుంగీతో కనిపిస్తారని చెప్పొచ్చు. అటు డైరెక్టర్స్ కూడా అగ్ర హీరోలకు మాస్ క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో ఈ లుంగీకట్టుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం విశేషం.
ఈ హీరోలతో పాటు అల్లు అర్జున్ ఇప్పటికే 'పుష్ప' మూవీలో లుంగీతో కనిపించగా రామ్ చరణ్ గతంలో 'రంగస్థలం' సినిమాలో లుంగీ కట్టుతో ఆకట్టుకున్నాడు. వచ్చే ఏడాది రాబోయే 'గేమ్ ఛేంజర్' లోనూ రామ్ చరణ్ లుంగీలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ ప్యాక్ ఎపిసోడ్ లో తండ్రి పాత్ర పోషిస్తున్న చరణ్ కొంతసేపు లుంగీ కట్టుతో కనిపిస్తారట. అలా మన స్టార్ హీరోలంతా ఈ ట్రెండ్ ని ఫాలో అవ్వడం విశేషం.