మాస్ జాతర టీజర్ అప్డేట్.. దరువుకు సిద్ధంకండి!

మాస్ మహారాజా రవితేజ , భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'మాస్ జాతర'. 'ధమాకా' కాంబో మరొకసారి రిపీట్ కాంబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.;

Update: 2025-08-09 11:46 GMT

మాస్ మహారాజా రవితేజ , భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'మాస్ జాతర'. 'ధమాకా' కాంబో మరొకసారి రిపీట్ కాంబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. యంగ్ బ్యూటీ శ్రీ లీల మరొకసారి రవితేజ తో జతకట్టింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇప్పుడు విడుదల తేదీకి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సినిమా నుండి అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్ర బృందం.


అందులో భాగంగానే మాస్ జాతర నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయగా.. ఇప్పుడు టీజర్ అప్డేట్ పై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవరనాగ వంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ అప్డేట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 11న ఉదయం 11:08 గంటలకు మాస్ జాతర సినిమా నుండి టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మాస్ జాతర టీజర్ అప్డేట్ దరువుకు సిద్ధం కండి అంటూ చేసిన ఈ అనౌన్స్మెంట్ ఇప్పుడు అభిమానులలో అంచనాలు పెంచేశాయి.

మాస్ మహారాజా సినిమాలో అంటేనే మినిమం గ్యారెంటీ అనే రేంజ్ లో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. పైగా ఇప్పుడు ధమాకా కాంబో రిపీట్ అవ్వడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి భారీ అంచనాల మధ్య వినాయక చవితి సందర్భంగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. అంతేకాదు ఈ సినిమాకి ఐదు రోజుల లాంగ్ వీకెండ్ లభించడంతో.. అటు నిర్మాతలు కూడా ఖుషీ అవుతున్నారు. మరి ఐదు రోజుల లాంగ్ వీకెండ్ తో ప్రేక్షకులను థియేటర్ కి ఏ రేంజ్ లో రప్పిస్తుందో చూడాలి.

రవితేజ ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో #RT 76 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీ అలాగే ఎమోషన్స్ తో కలగలసిన చిత్రంగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకి కూడా మరో ఆరు నెలల గ్యాప్ ఉండడంతో ఈలోగా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేయాలని అటు దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే జూలై 16వ తేదీన ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు . ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ గా ప్రకాష్ పనిచేస్తున్నారు. ఇకపోతే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని వార్తలు రాగా.. అటు కేతిక శర్మ, ఆశికా రంగనాథ్, మిమితా బైజు , కాయాదు లోహర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే ఈ నలుగురిలో ఇద్దరిని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Tags:    

Similar News