మాస్ జాతర, కే- ర్యాంప్.. ఆడియన్స్ వాటిని రిసీవ్ చేసుకుంటారా?
టాలీవుడ్ సినిమాలు మాస్ జాతర, కే- ర్యాంప్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ సినిమాలు మాస్ జాతర, కే- ర్యాంప్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకోగా.. సీనియర్ హీరో రవితేజ మాస్ జాతర మూవీ అక్టోబర్ 31వ తేదీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దీపావళి కానుకగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కే-ర్యాంప్ చిత్రం అక్టోబర్ 18న థియేటర్స్ లోకి రానుంది.
దీంతో రెండు సినిమాల మేకర్స్.. ఇప్పటికే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. అందులో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన కంటెంట్ లో అనేక బూతులు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణ జీవితంలో బూతులు కామన్ అయినా.. సినిమాల్లో ఎందుకు ఉపయోగిస్తున్నారని పలువురు పెదవి విరిచారు.
సినీ ప్రియుల్లో బూతులు చాలా మంది యూజ్ చేస్తున్నా.. స్క్రీన్ పై వాటిని చాలా మంది రిసీవ్ చేసుకోలేరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సినిమా చూస్తారు. కాబట్టి బూతులు ఇష్టానుసారంగా వినియోగించడం సరైన పద్ధతి కాదనే చెప్పాలి. కాబట్టి మాస్ జాతర ఓలే ఓలే సాంగ్, కే- ర్యాంప్ ట్రైలర్ లోని బూతులుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు రెండు సినిమాల మేకర్స్ బూతుల విషయంలో సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. కొన్ని సినిమాల్లో ఎన్ని ఎంత డబుల్ మీనింగ్ ఉన్నా.. ఎవరూ పట్టించుకోరని డైరెక్టర్ భాను భోగవరపు వ్యాఖ్యానించారు. మాస్ జాతరలో ఉత్సవాల్లో సాధారణంగా ప్రేమగా తిట్టుకునే పదాలనే పాటలో పెట్టినట్టు చెప్పారు.
పాటలోని మొదటి లైన్లపై మాత్రమే ఫోకస్ చేస్తున్నారని, కానీ తర్వాత భాగంలో ఫన్ కూడా ఉందని రవితేజ తెలిపారు. ఇంగ్లీష్ లో అసభ్య పదాలు సాధారణంగా వాడతారని, అవే తెలుగులో ఉంటే ఎందుకు ఇబ్బందని తిరిగి ప్రశ్నించారు. మరోవైపు, అబ్బవరం.. హీరో పాత్ర ఎలా ఉండబోతున్నాడో చూపించేందుకు టీజర్ లో బూతులు యాడ్ చేశామన్నారు.
కానీ సినిమాలో అలాంటి పదాలు దాదాపుగా ఉండవని అన్నారు. ట్రైలర్ విడుదలయ్యే సరికి ఈ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందని తెలిపారు. కానీ పూర్తి స్థాయిలో బూతులు లేవని చెప్పలేదు. మొత్తానికి రెండు సినిమాల టీమ్స్.. సమర్థించుకునే ప్రయత్నం చేసినా.. ఆడియన్స్ మాత్రం అంగీకరించడం కష్టం. ఏదేమైనా చిత్రాలు రిలీజ్ అయ్యాక.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.