• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డైరెక్టర్ విజయ్ పై...

డైరెక్టర్ విజయ్ పై ట్రోలింగ్.. సారీ చెప్పిన మంచు మనోజ్..

| ఇప్పుడు ఆ విషయంపై మంచు మనోజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా భైరవం మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన, విజయ్ పై ట్రోల్స్ విషయంపై మాట్లాడారు.

By - Tupaki Desk
Update: 2025-05-26 07:37 GMT

డైరెక్టర్ విజయ్ కనకమేడలపై ఇటీవల ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయన ఫేస్ బుక్ అకౌంట్ లోని ఓ పోస్ట్ పై కొద్ది రోజుల క్రితం ట్రోల్స్ ఎదుర్కొన్నారు. మెగా అభిమానులు విజయ్ పై మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే ఆయన రెస్పాండ్ అయ్యారు. వారికి క్షమాపణలు చెప్పారు. అప్పుడు తన అకౌంట్ హ్యాక్ అయ్యి ఉంటుందని తెలిపారు.

ఇప్పుడు ఆ విషయంపై మంచు మనోజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా భైరవం మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన, విజయ్ పై ట్రోల్స్ విషయంపై మాట్లాడారు. ఇటీవల భైరవం మూవీ విషయంలో బాయ్‌ కాట్‌ ట్రెండ్‌ నడిచిందని, విజయ్‌ పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తిగా కొనియాడారు మంచు మనోజ్.

ఆయన ఎప్పుడూ పదిమందికి సేవ చేస్తూ ఉంటారని తెలిపారు. విజయ్ ఏదో ఒక పోస్ట్ పెట్టారని అంటున్నారని, అది నిజమో కాదో తెలియదని అన్నారు. మెగా హీరోలు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ కు విజయ్ వీరాభిమానని అని తెలిపారు. అందరూ ఒక్కటై మనల్ని ఒంటరిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

అందుకే వేరే ఎవరైనా అంటే విజయ్‌ పట్టించుకునేవారు కాదని తెలిపారు. కానీ, తన ఫ్యామిలీ లాంటి మెగా అభిమానులు ట్రోల్స్ చేస్తుంటే.. ఆయనను అలా చూడలేకపోతున్నట్లు తెలిపారు. మెగా ఫ్యాన్స్ అంతా భైరవం మూవీకి సపోర్ట్ చేయాలని కోరారు. ఒకవేళ పోస్టు విషయంలో ఇబ్బంది ఫీల్‌ అయితే క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్.

భైరవం టీమ్‌ తరఫున కూడా మెగా అభిమానులందరికీ క్షమాపణలు చెప్పారు. ఏదైనా సినిమా మాత్రం ఒక్కరి వల్ల సాధ్యం కాదని అన్నారు. ఎంతోమంది కష్టంతో కూడుకున్నదే సినిమా అని చెప్పారు. తాను తొమ్మిదేళ్ల ఏళ్ల గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు. తన వెన్నంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు కూడా చెప్పారు.

అదే సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా మాట్లాడారు. దర్శకుడు విజయ్ తన వంతు కృషి చేశారని, ఆయన అంకితభావం మూవీ అంతటా కనిపిస్తుందని చెప్పారు. భైరవం మామూలు మూవీ కాదని, మనసును కదిలించేలా ఫైనల్ కట్ ఉందని చెప్పారు. మే 30వ తేదీన జరగనున్న పండుగలో అందరూ భాగం అవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరి భైరవం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

మా దర్శకుడు మెగా అభిమాని నాకు తెలుసు.
అయన అలాంటి పోస్ట్ ఎందుకు పెడతారు - #ManchuManoj #BhairavamOnMay30th #NaraRohith #BellamkondaSreenivas #Bhairavam #TeluguCinema #Tupaki pic.twitter.com/wDWlBNZZiX

— Tupaki (@tupaki_official) May 26, 2025
Tags:    
  • BhairavamMovie 
  • VijayKanakamedala 
  • ManchuManoj 
  • BellamkondaSaiSrinivas 
  • MegaFansSupport 
  • TollywoodNews 
  • MoviePreRelease 
  • FilmIndustrySupport 
  • Filmindustry 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS