జిమ్ కి ఆటోలో వెళ్లిన మనోజ్ దంపతులు.. అసలేమైందంటే?

సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఎక్కడైనా వారు పబ్లిక్ లోకి వెళ్లారు అంటే.. ఇక అభిమానులు వారిని ఏ రేంజ్ లో చుట్టుముడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2026-01-10 06:15 GMT

సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఎక్కడైనా వారు పబ్లిక్ లోకి వెళ్లారు అంటే.. ఇక అభిమానులు వారిని ఏ రేంజ్ లో చుట్టుముడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ తో సెల్ఫీ దిగాలని, కరచాలనం చేయాలని, వారితో మాట్లాడాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే సెలబ్రిటీలు పబ్లిక్ లోకి రావాలి అంటే సెక్యూరిటీ సహాయం లేకుండా అడుగుపెట్టరు అనేది వాస్తవం. అయితే మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం గెటప్ లు మార్చుకొని పబ్లిక్ లోకి రావడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అయితే మాత్రం అరే మిస్ అయ్యామే అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక స్టార్ హీరో తన భార్యతో కలిసి చాలా నార్మల్ గా ఆటోలో జిమ్ కి వెళ్ళిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా ఈ వీడియోని ఆ స్టార్ హీరో తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. మరి ఏంటా ఈ ఆటో స్టోర్ అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఆయన ఎవరో కాదు మంచు వారసుడు మంచు మనోజ్.. తన భార్య మౌనిక.. అందులో మంచు మనోజ్ జర్కిన్ ధరించి , కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కనిపించాడు. పక్కనే ఆయన భార్య మౌనిక కూడా ఆ వీడియోలో కనిపించారు. తాజాగా ఈ వీడియోని మనోజ్ షేర్ చేస్తూ.." నేను నా భార్య కార్లో జిమ్ కి వస్తుంటే.. కారు బ్రేక్ డౌన్ అయింది. అందుకే ఆటో పట్టుకొని జిమ్ కి వచ్చేసాం.. చలిలో కూడా జిమ్ మిస్ అవ్వకూడదు. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడం కోసమే మార్నింగ్ జిమ్ కి వచ్చేసాం. కాకపోతే ఆటోకి డబ్బులు లేవు మేనేజ్ చేస్తాం" అంటూ మనోజ్ తెలిపారు. ప్రస్తుతం మనోజ్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

రీల్ హీరో కాదు రియల్ హీరో కామన్ మ్యాన్ మన మనోజ్ అన్న అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. మరొకరు అన్న ఆటో డ్రైవర్ కి నువ్వు ఎవరో తెలుసా? లేదా? అన్న అంత నార్మల్ గా వెళ్తున్నాడు అంటూ కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్లు చేస్తూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మనోజ్ విషయానికి వస్తే ఇటీవల భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్.. తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి, రక్షక్ చిత్రాలలో నటిస్తున్నారు. అలాగే వాట్ ది ఫిష్, బ్లాక్ స్వోర్డ్ సిరీస్ త్వరలోనే తెరపైకి రానున్నాయి.




Tags:    

Similar News