ఓయ్ హీరోయిన్ ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తుంటే మరికొంతమంది ఇండస్ట్రీలోకి రావడమే దర్శకులుగా అవతారం ఎత్తుతున్నారు.;
కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుడిలో అభిరుచి మారిపోతోంది.అందుకు తగ్గట్టుగానే అటు హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా తమ రూటు మార్చుకొని తమ ప్రతిభతో వివిధ రంగాలలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకే అనే రోజులు ఎప్పుడో పోయాయి. కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తుంటే మరికొంతమంది ఇండస్ట్రీలోకి రావడమే దర్శకులుగా అవతారం ఎత్తుతున్నారు.
అలా స్టార్ట్..కెమెరా.. యాక్షన్ అంటూ మెగా ఫోన్ పట్టుకొని కెప్టెన్ ఆఫ్ ద సినిమా బాధ్యతలను స్వీకరించి లేడీ డైరెక్టర్స్ గా తమ టాలెంటును ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అయిపోతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఇప్పటికే సుధా కొంగర, గీతు మోహన్ దాస్, నందిని రెడ్డి, నీరజ కోన లాంటి లేడీ దర్శకులు చిత్ర పరిశ్రమలో తమ అద్భుతమైన దర్శకత్వ మెలకువలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకున్న మరో లేడీ డైరెక్టర్ మానస శర్మ. ప్రస్తుతం నిహారిక నిర్మాణంలో మానసా శర్మ దర్శకురాలిగా చేస్తున్న చిత్రం రాకాస. హారర్ , కామెడీ ఫాంటసీతో ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ మూడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది .
ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి రాకాస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎల్లో కలర్ చుడీదార్ ధరించి కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని చాలా అమాయకంగా అందరి దృష్టిని ఆకట్టుకుంది డైరెక్టర్ మానస శర్మ. అందం , అభినయం, అమాయకత్వంతో పాటు చురుకైన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంది. తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న ఈ అమ్మాయిని చూసి ప్రతి ఒక్కరు ఓయ్ సినిమా హీరోయిన్ షామ్లీలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓయ్ సినిమా హీరోయిన్ షామ్లీల ఉన్న మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏం చేసింది ? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మానస శర్మ శ్రీకాకుళం జిల్లా నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . మొదట రచయిత్రిగా తన కెరియర్ను ప్రారంభించింది మానస శర్మ. అలా తొలిసారి షార్ట్ ఫిలిమ్స్ కి రచయితగా పనిచేసేది. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ 12న సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్ ద్వారా దర్శకురాలిగా, రచయితగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ సీరీస్ కి కూడా నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించడం గమనార్హం. అందం, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న మానస శర్మ ఇప్పుడు రాకాస చిత్రంతో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనా సింపుల్ స్మైల్ తో షామ్లీలా ఉంది అనే ఒక కారణంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది మానస శర్మ.. మరి రాకాస సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.