MSG సెన్సార్ రిపోర్ట్ అదిరిపోయిందిగా!

తొలిసారి చిరు, వెంకీ క‌లిసి మాస్ బీట్‌కు స్టెప్పులెయ్య‌డంతో ఈ ఇద్ద‌రు లెజెండ్స్‌ని వెండితెర‌పై చూసి తీరాల్పిందేన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.;

Update: 2026-01-06 13:07 GMT

మెగాస్టార్ నుంచి కామెడీ టైమింగ్‌తో ఫ్యామిలీ యాక్ష‌న్ మూవీ కావాల‌ని చాలా కాలంగా సినీ ల‌వ‌ర్స్‌, అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వేళ త‌న‌దైన మార్కు కామెడీ టైమింగ్‌తో చేస్తున్న ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు`. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. పండ‌గ వేళ ఫ్యామిలీ ఎమోష‌న్‌ల‌ని ప్ర‌ధాన ఆయుధంగా వాడుకుని అనిల్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించాయి. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్‌తో క‌లిసి అనిల్ రావిపూడి సినిమా చేయ‌డంతో అంద‌రి దృష్టి `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`పై ప‌డింది.

చిరు గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా, ఘ‌రానా మెగుడు` టైమ్ బాడీ లాంగ్వేజ్‌తో, మంచి కామెడీ టైమింగ్‌తో న‌టించిన ఈ మూవీ జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతూ సంక్రాంతి బ‌రిలో నిలిచింది. మెగాస్టార్‌తో క‌లిసి వెంకీ మామ కూడా రంగంలోకి దిగ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా చిరు, వెంక‌టేష్‌ల‌పై చిత్రీక‌రించిన మాస్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఇది ప్ర‌స్తుతం నెట్టింట ర‌చ్చ చేస్తోంది.

తొలిసారి చిరు, వెంకీ క‌లిసి మాస్ బీట్‌కు స్టెప్పులెయ్య‌డంతో ఈ ఇద్ద‌రు లెజెండ్స్‌ని వెండితెర‌పై చూసి తీరాల్పిందేన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో MSG మ‌రింత వైర‌ల్ అవుతోంది. ప్ర‌మోష‌న్స్‌ని కూడా ఓ రేంజ్‌లో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి హోరెత్తిస్తుండటంతో అంద‌రిలోనూ ఈ మూవీపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. ఇదిలా ఉంటే జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ సెన్సార్ రిపోర్ట్ వ‌చ్చేసింది. ఇన్ సైడ్ టాక్ ప్ర‌కారం రిపోర్ట్ అదిరిపోయింద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

చిరుతో క‌లిసి వెంక‌టేష్ క‌నిపించే స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. చిరు - అనిల్ క‌లిసి ప్రాజెక్ట్ మొద‌లు పెడుతున్నార‌నే వార్త బ‌య‌టికి వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచే ఈ మూవీపై పాజిటీవ్ టాక్ మొద‌లైంది. తాజా సెన్సార్ రిపోర్ట్ ప్ర‌కారం ఆ పాజిటివ్ వైబ్స్ మ‌రింత‌గా పెరిగిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. చిరు, వెంక‌టేష్ క‌లిసి తొలి సారి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజ్‌లో ర‌చ్చ చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. దీంతో సినీ ల‌వ‌ర్స్‌, ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ మ్యాజిక్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇందులో చిరు ఏజెంట్‌గా న‌టిస్తుండ‌గా ఆయ‌న‌కు జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌నిపించ‌బోతోంది. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే కామెడీ, ఆయా స‌న్నివేశాల్లో చిరు టైమింగ్ అదిరిపోద్ద‌ని, చిరు స్టైల్‌, స్వాగ్ ఈ మూవీకి ప్ర‌ధాన హైలైట్ కానున్నాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. కేథ‌రిన్ సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

Tags:    

Similar News