బాక్సాఫీస్ వద్ద 'మెగా' విధ్వంసం.. మొదటి వారం లెక్క ఇది!
సంక్రాంతి రేసులో ఎప్పుడూ పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కానీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.;
సంక్రాంతి రేసులో ఎప్పుడూ పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కానీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. పండగ సినిమాలంటే కేవలం హడావుడి మాత్రమే కాదు, లాంగ్ రన్‌లో నిలబడగలిగే స్టామినా కూడా ఉండాలని ఈ సినిమా నిరూపించింది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను విజేతగా నిలిపిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన బలం. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడటం ఫ్యాన్స్ కు ఒక ఐ ఫీస్ట్ లా మారింది. వింటేజ్ లుక్‌లో చిరంజీవి గ్రేస్, వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉండటం సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే, మేకర్స్ ఈ రోజు అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 292 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించారు. కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు 300 కోట్ల మార్క్ కు చేరువలో రావడం అంటే సాధారణ విషయం కాదు. ఈ నంబర్ చూస్తుంటే సంక్రాంతి విన్నర్ ఎవరు అనే విషయంలో ఇక ఎలాంటి సందేహాలు అవసరం లేదనిపిస్తోంది.
ఈ కలెక్షన్లలో మాస్ సెంటర్స్ వాటా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వచ్చే ఆదరణ ఈ సినిమాకు కూడా ప్లస్ అయ్యింది. మిగిలిన సినిమాలతో పోలిస్తే MSG కి థియేటర్ల సంఖ్య ఆక్యుపెన్సీ రేట్ నిలకడగా ఉండటం వల్లే ఈ భారీ ఫిగర్ సాధ్యమైంది. ముఖ్యంగా పండగ సెలవులు సినిమాకు బాగా కలిసొచ్చాయి.
షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణ విలువలు సినిమా రేంజ్ ను పెంచాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ బీట్స్ థియేటర్లలో రెస్పాన్స్ తెప్పించాయి. పోస్టర్ లో 'మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్' అని వేయడం చూస్తుంటే మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
ఏదేమైనా మొదటి వారంలోనే 292 కోట్లు రాబట్టిన ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. సెలవులు అయిపోయాయి. ఇక సోమవారం నుండి అసలైన పరీక్ష మొదలవుతుంది. ఈ ఫ్లో ఇలాగే కొనసాగితే 350 కోట్ల మార్క్ ను టచ్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద చిరు వెంకీల మ్యాజిక్ గట్టిగానే పనిచేసింది.