మమితా బైజు డిమాండ్ బాగుంది..!
ఐతే ఎవరైనా హీరోయిన్ తెలుగులో కాస్త క్రేజ్ తెచ్చుకుంటే చాలు వాళ్లకి వరుస ఆఫర్లు వస్తాయి. ప్రేమలు సక్సెస్ తో మమితాకు అలాంటి ఆఫర్లు వచ్చాయి.;

ప్రేమలు సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది క్యూట్ బ్యూటీ మమితా బైజు. దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా మళయాళంలో నటిస్తూ వచ్చిన మమితా బైజు అక్కడ ఒక మోస్తారు క్రేజ్ తో కెరీర్ కొనసాగిస్తుండగా ప్రేమలు సినిమా ఎప్పుడైతే రిలీజైందో అప్పటి నుంచి అక్కడ మిగతా భాషల్లో కూడా అమ్మడి పాపులారిటీ పెరిగింది. తన క్యూట్ లుక్స్ తో యూత్ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది మమితా బైజు. ప్రేమలుతో తెలుగు యువత మనసులు కూడా గెలుచుకుంది ఈ చిన్నది.
ఐతే ఎవరైనా హీరోయిన్ తెలుగులో కాస్త క్రేజ్ తెచ్చుకుంటే చాలు వాళ్లకి వరుస ఆఫర్లు వస్తాయి. ప్రేమలు సక్సెస్ తో మమితాకు అలాంటి ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పటికే ఆమె తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు ఓకే చేయడం వల్ల ఇక్కడ సినిమాలు కుదరలేదు. ఐతే మమితాకు కూడా పర్సనల్ గా తెలుగు సినిమాల్లో నటించాలన్న ఆలోచన ఉందని తెలుస్తుంది.
అందుకే ఆమె తెలుగు మేకర్స్ తో టచ్ లో ఉందని టాక్. ప్రేమలు తర్వాత తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడినా తను ఆల్రెడీ కమిటైన సినిమాల వల్ల మమితా ఇక్కడ సినిమాలను చేయట్లేదు. ఐతే ప్రస్తుతం మైత్రి మేకర్స్ ప్రదీప్ రంగనాథ్ తో చేస్తున్న సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఐతే మమితా సినిమా ఓకే చేయాలంటే కథ కూడా ఆమెను ఇంప్రెస్ చేయాలి. ఎలాంటి సినిమా పడితే అలాంటి కథ ఓకే చేయదని టాక్.
అందుకే తెలుగులో ఆఫర్లు వచ్చినా ఒకటి రెండు కథలు కేవలం సాంగ్స్ కోసమే అన్న భావన ఉండటంతో అమ్మడు కాదన్నది తెలుస్తుంది. అయితే ఇప్పటికీ మమితాకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అమ్మడు సరైన సినిమాతో ఇక్కడ అడుగు పెడితే మాత్రం టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ప్రేఅంలు రిలీజై ఏడాది కావొస్తున్నా ఇంకా మమితా సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించినా లక్షల కొద్దీ లైకులు కొట్టేస్తున్నారు. సో యూత్ లో ఆమెకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అయినా అమ్మడిని త్వరగా తెలుగు సినిమాల్లోకి తీసుకు రావాల్సిందే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మమితా తెలుగు సినిమా ఏది అవుతుందో చూడాలి. ఆల్రెడీ కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న మమితా బైజు తెలుగు తెర మీద ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఆమె ఫ్యాన్స్.