చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. ప్రేమలు భామ దారెటు?

కాకపోతే మమిత ఇప్పటివరకు చేసిన పాత్రలు ఎక్కువగా నేచురల్, యూత్‌ఫుల్‌గా ఉండేవే. పెద్ద యాక్షన్ సినిమా, భారీ సెటప్, స్టార్ హీరోతో గ్లామర్ ఎక్కువగా ఉండే పాత్రలో మాత్రం ఇంకా పరీక్ష కాలేదు.

Update: 2026-08-21 11:30 GMT

మమిత బైజు పేరు ఈమధ్య సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ప్రేమలు’తో ఒక్కసారిగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మాయి.. ఆ తర్వాత వరుసగా మంచి సినిమాలు పట్టేస్తోంది. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే మమిత నెక్స్ట్ ఎవరితో చేస్తుందన్నదే ఎక్కువ ఇంట్రెస్ట్‌గా మారింది.

‘ప్రేమలు’లో రీను పాత్ర మమితకు బాగా కలిసి వచ్చింది. నేచురల్ లుక్, సింపుల్ క్యారెక్టర్ కావడంతో ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. తర్వాత ప్రదీప్ రంగనాథన్‌తో ‘డ్యూడ్’, విజయ్ ‘జన నాయకన్’, ధనుష్ ‘కారా’ లాంటి సినిమాలతో తమిళంలో కూడా వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో కనిపించింది. ఇప్పుడు సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చేయడం వల్ల స్టార్ హీరో పక్కన కూడా మమిత ఎలా కనిపిస్తుందో ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇక్కడే ఆమె కెరీర్‌కు నెక్స్ట్ స్టెప్ కనిపిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల దగ్గర హీరోయిన్ కాంబినేషన్స్ కూడా పెద్ద చర్చే అవుతున్నాయి. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, త్రిప్తి డిమ్రి లాంటి పేర్లు వరుసగా పెద్ద సినిమాల్లో కనిపిస్తున్నాయి. అదే లిస్టులో మమిత పేరు కూడా చేరే టైమ్ వచ్చిందా అనిపిస్తోంది.

కాకపోతే మమిత ఇప్పటివరకు చేసిన పాత్రలు ఎక్కువగా నేచురల్, యూత్‌ఫుల్‌గా ఉండేవే. పెద్ద యాక్షన్ సినిమా, భారీ సెటప్, స్టార్ హీరోతో గ్లామర్ ఎక్కువగా ఉండే పాత్రలో మాత్రం ఇంకా పరీక్ష కాలేదు. అందుకే ఒక్కసారిగా అలాంటి సినిమా వస్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారన్నది కూడా చూడాలి. అదే సమయంలో ఇప్పుడున్న ఫ్రెష్ ఫేస్ ఇమేజ్ ఆమెకు పెద్ద ప్లస్ కావచ్చు. మరో విషయం ఏంటంటే మమితను ఇప్పుడు ఒక్క మలయాళ హీరోయిన్‌గా చూడడం కూడా కష్టం. ‘ప్రేమలు’తో తెలుగులో పరిచయం ఉంది.

తమిళంలో ఇప్పటికే విజయ్, ధనుష్, సూర్య లాంటి హీరోల సినిమాలు చేసింది. అంటే కొత్త పాన్ ఇండియా సినిమాలో తీసుకున్నా ఆమెను మొదటి నుంచి పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. మూడు ఇండస్ట్రీల్లో తెలిసిన ముఖం కావడం ఇప్పుడు మేకర్స్‌కు ఉపయోగపడే విషయం. అసలు లెక్క మాత్రం ఇప్పుడు ఆమె ఎలాంటి సినిమా ఎంచుకుంటుందన్నదే. మరో చిన్న లవ్ స్టోరీ చేస్తుందా.. లేక నేరుగా పెద్ద స్టార్ పక్కన కనిపిస్తుందా చూడాలి. ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తే మాత్రం మమితకు నెక్స్ట్ ఒక పెద్ద హీరో సినిమా పడితే కెరీర్ మరో లెవెల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News