ఒకేసారి ముగ్గురు సూపర్ స్టార్స్‌తో మమిత..!
ఇప్పటికే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయగన్ సినిమాలో మమిత ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.;
'ప్రేమలు' సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మ మమిత బైజు. అంతకు ముందు వరకు మలయాళ సినిమాలకు పరిమితం అయిన మమిత బైజు ఇప్పుడు వరుస తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ నుంచి కూడా ఈ అమ్మడికి ఆఫర్లు తలుపు తడుతున్నాయని తెలుస్తోంది. ఇటీవలే తమిళ మూవీ డ్యూడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ సినిమా రూ.100 కోట్లకు మించి వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో మమిత మరింత బిజీగా కోలీవుడ్‌లో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులోనూ డ్యూడ్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే తెలుగు ఫిల్మ్ మేకర్స్ నుంచి ఈమెకు ఆఫర్లు తలుపు తడుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి మమిత బైజు ఒకే ఏడాది వరుసగా పెద్ద హీరోల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
విజయ్ జన నాయగన్ సినిమాలో మమిత బైజు
ఇప్పటికే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయగన్ సినిమాలో మమిత ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ కానప్పటికీ చాలా కీలకమైన పాత్ర అంటూ సమాచారం అందుతోంది. ఆ సినిమా మమిత కెరీర్ గ్రాఫ్ ను మరింతగా పెంచుతుందనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తమిళ మరో సూపర్ స్టార్ సూర్య హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ మమిత బైజు నటిస్తోంది. సూర్యకు జోడీగా నటిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాపై మమిత చాలా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా మమిత బైజు మరో కొత్త సినిమాలోనూ మమిత నటించేందుకు రెడీ అయింది. అది కూడా తమిళ సూపర్ స్టార్ మూవీ కావడంతో ఒకే సారి ముగ్గురు స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకున్న అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
ధనుష్ హీరోగా మమిత బైజు హీరోయిన్‌గా...
తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించబోతున్న D54 సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా ఎంపిక అయింది. అధికారికంగా బయటకు రానప్పటికీ కోలీవుడ్ వర్గాల్లో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కోలీవుడ్ లో ఒకే ఏడాది అంటే 2026 లో ముగ్గురు సూపర్ స్టార్స్‌తో నటించిన సినిమాలతో మమిత బైజు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఈ స్థాయిలో ఆఫర్లు దక్కించుకోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈమె వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ మధ్య ఒక తెలుగు సినిమాలో మమిత నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. ఈ ఏడాది చివరి వరకు టాలీవుడ్‌లో మమిత సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
టాలీవుడ్‌లోనూ ఆఫర్లు..
2017 లో మలయాళం మూవీ సర్వోపరి పాలకరన్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మమిత బైజు ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. కేవలం కేరళ వరకే మమిత బైజు క్రేజ్, స్టార్‌డం పరిమితం అయింది. ఎప్పుడైతే మమిత యొక్క ప్రేమలు సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఆడిందో అప్పటి నుంచి తమిళ్, తెలుగు, ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు, గౌరవం దక్కింది. ఆకట్టుకునే అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ ఉన్న మమిత బైజు ముందు ముందు తన నటనతో మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టాలీవుడ్‌లో ఈమె జర్నీ ప్రారంభం అయితే వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా ఉండదు అనేది విశ్లేషకుల మాట. ప్రస్తుతానికి కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.