తండ్రికి ఓటేయమంటోన్న హీరోయిన్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కెమెరా కన్నుతో ఎన్నో అద్భుతమైన దృశ్యాలను తెరకెక్కించారు.;
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కెమెరా కన్నుతో ఎన్నో అద్భుతమైన దృశ్యాలను తెరకెక్కించారు. మలయాళ, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో భారీ, గొప్ప సినిమాలకు వర్క్ చేశారు మోహనన్. 1990వ సంవత్సరం నుంచి ఆయన ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. టీవీ సీరియల్స్, డాక్యుమెంటరీలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన మోహనన్ తర్వాత సినిమాల్లోకి ఎంటరయ్యారు.
టాలీవుడ్ లో మహర్షికి వర్క్ చేసిన మోహనన్
మోహనన్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు సినిమాకు కూడా వర్క్ చేశారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి మూవీకి ఆయనే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అంతేకాదు, గతేడాది ఆయన బాలీవుడ్ లో అగ్ని అనే మూవీకి వర్క్ చేయగా ఇప్పుడా సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఓటీటీ ఎడిషన్ లో నామినేట్ అయ్యారు.
ఫిల్మ్ ఫేర్ నామినేషన్లలో మోహనన్
ఈ విషయాన్ని మోహనన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ వెల్లడించారు. వీలు కుదిరినప్పుడల్లా తన తండ్రిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండే మాళవిక ఇప్పుడు మరోసారి తన తండ్రి గురించి మాట్లాడుతూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మాళవిక తన తండ్రి అగ్ని అనే సినిమా కోసం ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఓటీటీ ఎడిషన్ లో నామినేట్ అయ్యారని, దయచేసి ఆయనకు ఓటు వేయమని కోరారు.
తండ్రి గురించి గర్వంగా చెప్తోన్న మాళవిక
అంతేకాదు, ఈ వీడియోలో మాళవిక బ్లాక్ కలర్ షర్ట్, గోల్డ్ చెవిపోగులు ధరించి లూజ్ హెయిర్ తో, తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎంతో సంతోషంగా, మరింత గర్వంగా కనిపించారు. ఇక మాళవిక కెరీర్ విషయానికొస్తే అమ్మడు త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మాళవిక ఆఖరిగా హృదయపూర్వం సినిమాలో మోహన్ లాల్ తో కలిసి కనిపించారు.