మళ్లీ ఒక్కటైన బాలీవుడ్ జంట.. సో క్యూట్ కదా!
అయితే బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట తాజాగా మరోసారి మీట్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచారు.;
బాలీవుడ్ సెలబ్రిటీ మలైకా అరోరా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా తన డేటింగ్ వార్తల కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. గతంలో తన పార్ట్నర్ తో విడిపోయింది.కానీ తాజాగా మళ్ళీ తన మాజీని కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఇంతకీ మలైకా అరోరా కలిసిన ఆ వ్యక్తి ఎవరో కాదు అర్జున్ కపూర్.. తన కంటే వయసులో చిన్నవాడు అయినటువంటి బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్ తో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది మలైకా.. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనుకున్నారు. కానీ సడన్ గా వీరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తాయో ఏమో తెలియదు కానీ ఈ ఇద్దరు విడిపోయారు.
అయితే బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట తాజాగా మరోసారి మీట్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచారు. విషయంలోకి వెళ్తే..రీసెంట్ గా అర్జున్ కపూర్,మలైకా అరోరా ఇద్దరు ముంబైలో జరిగిన జాన్వీ కపూర్ "హోమ్ బౌండ్" ప్రీమియర్ లో కలసి కనిపించారు.వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది.. మలైకా, అర్జున్ ఇద్దరూ విడిపోయినప్పటి నుండి చాలా దూరం దూరంగా ఉన్నారు. కానీ సడన్ గా ఈ జంట ఎదురెదురు పడినప్పుడు చాలా ప్రేమగా కౌగిలించుకొని చిరునవ్వుతో పలకరించుకోవడంతో ఈ సీన్ చూసిన చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఇందులో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వాల్ పాల్గొన్నారు.ఇక తన సోదరి జాన్వీ కపూర్ కి మద్దతుగా అర్జున్ కపూర్ కూడా ఈ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు.ఈ ప్రీమియర్ నుండి ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కానీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మలైకా అరోరా, అర్జున్ కపూర్ హగ్ చేసుకున్న వీడియో.. వీరిద్దరూ ఆ ఈవెంట్లో ఒకరినొకరు ప్రేమగా హగ్ చేసుకుని పలకరించుకున్నారు.
అయితే విడిపోయిన తర్వాత ఈ జంట బహిరంగ ప్రదేశాలలో కలిసి మొదటిసారి కనిపించారు.
వీళ్లిద్దరూ విడిపోయినా కూడా తిరిగి కలిసినప్పుడు ప్రేమగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొంతమంది బ్రేకప్ చెప్పుకున్నాక తమ మాజీలను కలిసినప్పుడు కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ వీళ్లు మాత్రం అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా చాలా బాగా మాట్లాడుకోవడంతో దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల డేటింగ్ విషయానికి వస్తే..2018 నుండి మలైకా,అర్జున్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు.కానీ గత ఏడాది అక్టోబర్ లో వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వినిపించాయి.. మలైకా అరోరా మొదట సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకుని ఒక బాబు పుట్టాక విడాకులు తీసుకుంది.విడాకులు అయ్యాక అర్జున్ కపూర్ తో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.