మహేష్ లుక్ అది ఫైనల్ కాదా..?

మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తో తన లుక్ రివీల్ చేసిన మహేష్ రీసెంట్ గా ఒక మ్యారేజ్ ఈవెంట్ లో కూడా అదే లుక్ తో కనిపించాడు.

Update: 2024-04-30 03:40 GMT

గుంటూరు కారం తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్. రాజమౌళి డైరెక్షన్ లో తను చేసే సినిమా కోసం తన లుక్ ని మార్చుకున్నాడు. నిన్న మొన్నటిదాకా తలకు క్యాప్ పెట్టుకుని తిరిగిన మహేష్ ఈమధ్య లుక్ రివీల్ చేశాడు. గడ్డం అంత పెద్దగా ఏం లేదు కానీ లాంగ్ హెయిర్ మాత్రం మహేష్ ని మరింత అందంగా మార్చేసింది. మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తో తన లుక్ రివీల్ చేసిన మహేష్ రీసెంట్ గా ఒక మ్యారేజ్ ఈవెంట్ లో కూడా అదే లుక్ తో కనిపించాడు.

మామూలుగా అయితే రాజమౌళి తన సినిమాలోని హీరో లుక్ ని అంత త్వరగా రివీల్ చేయనివ్వడు. రాజమౌళి సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో సినిమాటోగ్రాఫర్ దగ్గర ఉన్న కెమెరా తప్ప సెట్ లో ఎవరి దగ్గర సెల్ ఫోన్ కూడా ఉండదు. అలాంటిది రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ని అలా ఓపెన్ చేస్తారని అనుకోలేం. మహేష్ రాజమౌళి సినిమాలో సూపర్ స్టార్ లుక్ అది ఫైనల్ కాదని టాక్. అందుకే మహేష్ పొడవాటి జుట్టుతో బయట కనిపిస్తున్నాడు.

సినిమాలో మహేష్ లుక్ ఇంకాస్త స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా అదే రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మహేష్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాను జూన్, జూలై అలా మొదలు పెట్టి నెక్స్ట్ ఇయర్ మొత్తం షూటింగ్ చేసి 2026 సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సో మహేష్ తో రాజమౌళి మరో భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని అర్థమవుతుంది. మహేష్ బయట కనిపిస్తున్న జులపాల జుట్టు ఫైనల్ కాదని.. అందులో చాలా మార్పులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

అలా లుక్ అంత ఈజీగా రివీల్ చేయడానికి అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి ఆ ఛాన్సే లేదని చెప్పుకుంటున్నారు. సినిమా ఫైనల్ కాస్టింగ్ ఇంకా సినిమా గురించి మొత్తం డీటెయిల్స్ త్వరలో రాజమౌళి మహేష్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మే 31 సూపర్ స్టార్ జయంతి రోజు మహేష్ రాజమౌళి సినిమా లాంచింగ్ ఉంటుందని టాక్.

Tags:    

Similar News