అక్కతో మహేష్.. వ్వాటే క్యూట్ మూమెంట్

అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ తో కాలక్షేపం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సినిమా ఈవెంట్స్ కి కూడా పెద్ద అటెండ్ కాడు.

Update: 2024-04-29 06:21 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు పార్టీలు, పబ్ లు అంటూ బయట కల్చర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడనే సంగతి అందరికి తెలిసిందే. తనకి ఖాళీ సమయం దొరికితే ఇంట్లో కొడుకు, కూతురుతో టైమ్ స్పెండ్ చేస్తాడు. అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ తో కాలక్షేపం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సినిమా ఈవెంట్స్ కి కూడా పెద్ద అటెండ్ కాడు.

సూపర్ స్టార్ వీలైనంత వరకు తన పర్సనల్ స్పేస్ లో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండేలా చూసుకుంటాడు. అందుకే ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ని పెర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ గా అందరూ అభివర్ణిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయితే ఫ్యామిలీతో పదిరోజుల పాటు వెకేషన్ ప్లాన్ చేసుకొని వేరే దేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు.

అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో తన అక్క, చెల్లితో కలిసి టైం స్పెండ్ చేస్తాడు. మహేష్ బాబు, మంజుల మధ్య ఎక్కువ సాన్నిహిత్యం కనిపిస్తూ ఉంటుంది. మంజుల కూడా యాక్టర్ గా అడుగుపెట్టి తరువాత నిర్మాతగా మారింది. ఆ తరువాత దర్శకురాలిగా కూడా ప్రయత్నం చేసింది. ఇండస్ట్రీతో ఎక్కువ ఎటాచ్ అయ్యి ఉండటంతో మహేష్ బాబుతో కూడా ఎక్కువ టచ్ లో ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తమ్ముడిని మంజుల ఆటపట్టిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ మూవీ కోసం లాంగ్ హెయిర్ స్టైల్ తో ప్రత్యేకంగా సిద్ధం అయ్యారు. ప్రస్తుతం అదే లుక్ తో సూపర్ స్టార్ కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ అభిమానులకి ఈ లాంగ్ హెయిర్ లుక్ బాగా నచ్చుతుంది.

Read more!

తాజాగా తన ఫ్యామిలీ ఫంక్షన్ లో మంజుల మహేష్ బాబు హెయిర్ టచ్ చేస్తూ ఏదో జోక్ పేల్చింది. దీంతో ఇద్దరు సరదాగా నవ్వుకున్నారు. ఈ సిచువేషన్ ని ఎవరో క్యాండెడ్ వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా మహేష్ అందానికి మాత్రం వయసు తగ్గడం లేదని నెటిజన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాజమౌళి, మహేష్ బాబుతో చేయబోయే పాన్ వరల్డ్ మూవీకి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రావొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News