• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్‌ - రాజమౌళి మూవీ...

మహేష్‌ - రాజమౌళి మూవీ మరింత ఆలస్యం!

| కానీ ఇప్పుడు జనవరిలోనూ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-25 07:04 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వచ్చి మూడేళ్లు కావస్తుంది. ఇప్పటి వరకు జక్కన్న తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. రెండేళ్ల క్రితమే రాజమౌళి దర్శకత్వంలో తదుపరి సినిమా మహేష్ బాబు హీరోగా అని క్లారిటీ ఇచ్చారు. గత ఏడాది కాలంగా సినిమా స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందని చెప్పారు. మొదట ఈ ఏడాది చివర్లో అంటే 2024 డిసెంబర్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ డిసెంబర్‌లో కాదు 2025 జనవరిలో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు జనవరిలోనూ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి.

సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ మార్చి నెలలో ప్రారంభం కాబోతుంది. అంటే ఇంకా నాలుగు నెలలకు సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నారు. అతే కాకుండా కథ, పాత్రలు, టెక్నికల్‌ విషయాలపై వర్క్ షాప్ నడుస్తుందట. మహేష్ బాబు సైతం ఆ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రాజమౌళి ఏం చేసినా ప్రేక్షకులు ఓపికగా ఎదురు చూస్తారు అనడంలో సందేహం లేదు.

ఆయన నుంచి మరో వెయ్యి కోట్ల సినిమా రావాలి అంటే కచ్చితంగా మరికొంత కాలం వెయిట్‌ చేసినా తప్పులేదు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం అన్నట్లుగా చాలా ఎక్కువగా జుట్టు పెంచి ఇప్పుడు ఆ జుట్టు, గడ్డం తొలగించాడు. దాంతో రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటుకు ఏకంగా ఆస్కార్‌ అవార్డు దక్కింది. అందుకే మహేష్ బాబు సినిమాకు రెండు మూడు ఆస్కార్‌ అవార్డులు అయినా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో రాజమౌళి ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న సినిమా ఇంటర్నేషనల్‌ లెవల్‌ అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ మాత్రమే కాకుండా హాలీవుడ్‌ నటి ఈ సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. విల్బర్‌ స్మిత్‌ నవల ఆధారంగా భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా అడ్వంచర్ మూవీగా ఈ సినిమా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • SSMB29 
  • Maheshbabu 
  • SsRajamouli 
  • Shooting 
  • Releasesdelayed 
  • VijayendraPrasad 
  • Hollywoodactress 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS