'మహావతార్ నరసింహ'.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

'మహావతార్ నరసింహ'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే మాట్లాడుకుంటున్నారు.;

Update: 2025-08-03 05:08 GMT

'మహావతార్ నరసింహ'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే మాట్లాడుకుంటున్నారు. థియేటర్స్ లో మూవీ చూసిన ప్రతి ఒక్కరూ మస్ట్ వాచబుల్ పిక్చర్ అని చెబుతున్నారు. కచ్చితంగా చూడాల్సిన మూవీ అంటూ సినీ ప్రియులకు సజ్జెస్ట్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఆ సినిమాకు చెందిన పోస్టులు కనిపిస్తున్నాయి.


అంతలా మూవీ లవర్స్ ను ఫిదా చేసింది చిత్రం మహవతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చిన్నగా సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు లేకుండా వచ్చిన ఆ మూవీ.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మిగతా అన్ని సినిమాలకు షాక్ ఇస్తోంది!

మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న సినిమా.. ఇప్పుడు రిలీజ్ అయ్యి 9 రోజులు అవుతున్నా ఓ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తోంది. దేశంలోని యానిమేటెడ్‌ సినిమాల్లో ఇటీవల కొత్త చరిత్ర సృష్టించింది. 8 రోజుల్లోనే రూ.60.5 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని రీసెంట్ గా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్ గా వెల్లడించింది.

దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్‌ సినిమాగా రికార్డు నెలకొల్పిందని తెలిపిన హోంబలే.. అమెరికాలో కూడ వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిందని చెప్పింది. మొదటి వారం భారీ వసూళ్లు రాబట్టిన చిత్రం.. ఇప్పుడు రెండో వారంలో అనేక పెద్ద సినిమాల కన్నా మెరుగైన వసూళ్లు రాబట్టి ఒక్కసారి బాక్సాఫీస్ వద్ద షాక్ ఇచ్చింది.

సాక్నిల్క్ అంచనాల ప్రకారం, రెండో శనివారం.. మహావతార్ నరసింహ రూ.15 కోట్లు వసూలు చేసింది. ఇది మొదటి శనివారం వసూళ్లు చేసిన రూ.4.60 కోట్ల కన్నా చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడున్న మూవీ దూకుడు చూస్తుంటే..త్వరలో ప్రతిష్టాత్మకమైన రూ.100 కోట్ల మార్కును దాటే దిశగా పయనిస్తుందని చెప్పాలి.

మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2.. శనివారం రూ.7.50 కోట్లు వసూలు చేసింది. అది మహావతార్ నరసింహ కలెక్షన్స్ లో సగం కావడం గమనార్హం. ధడక్ 2 రూ.3.75 కోట్లు మాత్రమే రాబట్టింది. సైయారా మూడో శనివారం అయినా రూ.6.35 కోట్లు సాధించింది. కింగ్ డమ్ అన్ని భాషలు కలిపి రూ.8 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అన్ని సినిమాలకు వెనక్కి నెడుతూ మహవతార్ నరసింహ దూసుకుపోతోంది.

Tags:    

Similar News