ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ మహావతార్ నరసింహ!
ఈ శుక్రవారం (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.;
ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలు లేదా 8 వారాలలోపే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ సినిమా టాక్ ను బట్టి ఓటీటీ డేట్ కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ సినిమా థియేటర్లలో పాజిటివ్ బజ్ తెచ్చుకుంటే ఇంకొన్ని రోజులు థియేటర్లలో ఆడుతుంది. ఒకవేళ మొదటి రెండు రోజుల్లోనే నెగిటివ్ టాక్ తెచ్చుకొని, కలెక్షన్లు పెద్దగా రాకపోతే నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చి అటు అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
ఇకపోతే ఒక సినిమా ఎటువంటి నటీనటులు లేకుండా.. అంచనాలు లేకుండా కేవలం యానిమేషన్ ఆధారంగా వచ్చి నేడు బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా రాబోతోంది. అదేదో కాదు 'మహావతార్ నరసింహ'. ఎటువంటి అంచనాలు లేకుండా యానిమేషన్ మూవీ గా వచ్చిన మహావతార్ నరసింహ జూలై 25వ తేదీన బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. మొదటి , రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల నెట్ కలెక్షన్స్ తో రికార్డు సృష్టించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
మహావిష్ణువు దశావతారాల ఆధారంగా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తొలి చిత్రంగా మేకర్స్ దీనిని విడుదల చేశారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని కన్నడ బడా నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ సమర్పణలో కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్, శిల్పా ధవాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దాదాపు 200కు పైగా స్క్రీన్ లలో దాదాపు 50 రోజులు పూర్తి చేసుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.340 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
అలా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. మరింకెందుకు ఆలస్యం థియేటర్లలో చూడలేకపోయామని బాధపడిన వారందరికీ ఇది మంచి సమయమని చెప్పవచ్చు. ఇక ఈ మహావతార్ నరసింహ మూవీని హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ , మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా పోస్టర్ తో సహా ప్రకటించింది.
ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇప్పటికే థియేటర్లలో భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇటు ఓటీటీ లో కూడా ఊహించని టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుందని నెట్ ఫ్లిక్స్ భావిస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.