యంగ్ హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. మాధవన్ ఏమన్నారంటే

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పాజిటివ్తోపాటు, నెగటివ్ రోల్స్లోనూ నటించి ఆడియెన్స్ ను మెప్పించారు.;

Update: 2025-07-09 10:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పాజిటివ్తోపాటు, నెగటివ్ రోల్స్లోనూ నటించి ఆడియెన్స్ ను మెప్పించారు. తాజాగా ఆయన '‘ఆప్ జైసా కోయి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జులై 11న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మాధవన్.. చిత్ర పరిశ్రమలో కొన్ని మార్పులు వస్తున్నాయని అన్నారు.

సీనియర్ హీరోలు, యంగ్ హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ, రొమాన్స్ తెరకెక్కించడంలో ఇండస్ట్రీలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు, యువకుల్లా నటిస్తూ హీరోయిన్ వెంటబడి ప్రేమించే రోజులు పోయాయి. అలాంటి స్టోరీలను హీరోలు కూడా ఆంగీకరించడం లేదని మాధవన్ అన్నారు. అలాగే హీరోల వయసుకు తగ్గ ప్రేమ కథను తెరపై చూపించాలంటే దర్శకుడికి టాలా టాలెంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు.

చాలా కాలంగా వయసుకు తగిన పాత్రలు చేయడమే తనకు ఇష్టమని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాను గతంలో చేసిన ఓ సినిమా గురించి మాధవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా '3 ఇడియట్స్' లో తన పాత్ర పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. 40ఏళ్ల వయసులో కాలేజీ కుర్రాడిగా నటించడం తనకు ఏ మాత్రం సంతృప్తి ఇవ్వలేదని మాధవన్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. కాగా, 2009లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకుంది.

కాగా, ఇండస్ట్రీలో మాధవన్ ఎప్పుడు కూడా ట్రెండ్ ఫాలో అవ్వలేదు. ఆయన స్ట్రిప్ట్ లు ఎంపిక చేసుకొనే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. వయసుకు తగిన పాత్రలు, ఆ పాత్రకు ప్రాధాన్యం ఉన్న రోల్ లో నటించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మిగతా హీరోలు అలా కాదు. తమకున్న మార్కెట్, ప్రొడ్యుసర్ల ఒత్తిళ్ల వల్ల లేదంటే ప్రేక్షుకులను ఆకట్టుకునేందుకు కొన్ని రకాల పాత్రలు చేస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో ప్రతిష్టాక్మతంగా తెరకెక్కుతున్న 'SSMB 29' సినిమాలో మాధవన్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో మాధవన్ ను మహేష్ తండ్రి పాత్ర కోసం మేకర్స్ ఆయనను సంప్రదించగా గ్నీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ మాధవన్- మహేష్ బాబు సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం థియేటర్లు బ్లాస్టే!

Tags:    

Similar News