దెయ్యంతో లవ్.. థ్రిల్లింగ్ గా లవ్ మీ ట్రైలర్

ఇప్పటికే విడుదలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లవ్ మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గురువారం మధ్యాహ్నం నిర్వహించారు.

Update: 2024-05-23 13:04 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ మీ. అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్ కు ప్రస్తుతం సిద్ధమవుతోంది. మే 25వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇప్పటికే విడుదలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లవ్ మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ వేడుకకు దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే టీజర్ ద్వారా దెయ్యంతో హీరో ప్రేమాయణం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఆ తర్వాత ట్రైలర్ ద్వారా అసలు విషయం కూడా చెప్పేశారు.

ఇప్పుడు లవ్ మీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. దెయ్యాలు ఉన్నాయని నమ్ముతావా అంటూ వైష్ణవి డైలాగ్ తో కొత్త ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పేరు దివ్యావతి అని చెబుతుంది. తనకు అర్జున్ (ఆశిష్) అంటే చాలా భయమని, ఎప్పుడూ బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడని, చెప్పులు ఉండవని అని అంటుంది. అందుకే భయమని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక దేవుళ్ళు అంటే బాగా భక్తి ఉన్నోళ్లకు, దెయ్యాళ్లంటే కూడా భయముంటదని, దెయ్యాన్ని నా కెమెరాలో రికార్డు చేస్తానని చెబుతాడు హీరో.

Read more!

ఆ తర్వాత దెయ్యంతో ప్రేమలో హీరో పడడాన్ని చూపించారు మేకర్స్. ఇక దెయ్యం దివ్యావతి కోసం హీరో వెతుకుతుంటాడు. చివరకు ఏమైందనేది సినిమాగా తెలుస్తోంది. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ థ్రిల్లింగ్ గా ఉంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఆశిష్ తన టాలెంట్ ను మరోసారి చూపించారు. వైష్ణవి అదరగొట్టింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నట్లు కొత్త ట్రైలర్ చూస్తుంటే ఈజీగా తెలుస్తోంది.

ఆశిష్, వైష్ణవి నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. స్టార్ టెక్నీషియన్ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేస్తున్నారు. వైష్ణవి బేబీ లాగా ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే రౌడీ బాయ్స్ సినిమాతో అలరించిన యంగ్ హీరో ఆశిష్.. మరి లవ్ మీ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News