అనుష్క తర్వాత రేసులో సమంత!
`కూలీ` రిలీజ్ తో లోకేష్ కనగరాజ్ ప్రీ అయిపోయాడు. తదుపరి కర్తవ్యం ఎల్ సీ యూ నుంచి `ఖైదీ 2`ని పట్టాలెక్కించడమే.;
`కూలీ` రిలీజ్ తో లోకేష్ కనగరాజ్ ప్రీ అయిపోయాడు. తదుపరి కర్తవ్యం ఎల్ సీ యూ నుంచి `ఖైదీ 2`ని పట్టాలెక్కించడమే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు బ్యాకెండ్ టీమ్ నిర్వహిస్తోంది. రేపటి నుంచి ఆ పను లు మరింత వేగవంత కానున్నాయి. కార్తీ కూడా వీలైనంత త్వరంగా ఆన్ సెట్స్ లోఉన్న ప్రాజెక్ట్లు పూర్తి చేసి లోకేష్ టీమ్ తో కలవాడినికి రెడీ అవుతున్నాడు. ఈసారి ప్రాజెక్ట్ లోకి లోకేష్ లేడీ భామల్ని కూడా తెరపైకి తెస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఓ కీలకపాత్రకు స్వీటీ అనుష్క పేరును పరిశీలి స్తున్నట్లు తెరపైకి వచ్చింది.
అనుష్క సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె పాత్ర వివరాలు రివీల్ కాలేదుగానీ లోకీ టీమ్ తో మాత్రం ఇంటరాక్ట్ అవుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాజెక్ట్ రేసులోకి సమంత పేరు తెరపైకి వస్తోంది. సమంతను కూడా ఓ కీలక పాత్రకు పరిశీలిస్తున్నట్లు వినిపిస్తుంది. మరి సమంత రోల్ సపరేటా? ఒకే పాత్ర కోసం అనుష్క, సమంత పేర్లు పరిశీలిస్తున్నారా? అన్నది తేలాల్సిన అంశం. ఎల్ సీ యూ నుంచి రిలీజ్ అయిన ఖైదీ, విక్రమ్ లో లేడీ భామలు ఎక్కడా కనిపించలేదు.
అందులో కథ అంతా మేల్ పాత్రల చుట్టూనే నడిపించాడు లోకీ. పాటలకు ఛాన్స్ తీసుకోలేదు. స్టోరీ.. ..గ్రి ప్పింగ్ స్క్రీన్ ప్లేతోనే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసాడు. ఈ నేపథ్యంలో ఎల్ సీయూలో అందమైన భామలు యాడ్ అయితే తెర పరిపూర్ణమయ్యేది? అన్న అంశం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలో `ఖైదీ 2`కి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. సమంత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
`ఖుషీ ` తర్వాత హీరోయిన్ గా మ్యాకప్ వేసుకోలేదు. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేయడం తప్ప హీరోయిన్ ఛాన్స్ తీసుకోలేదు. అటు అనుష్క కూడా సీరియస్ గా కెరీర్ ని పట్టాలెక్కించడం లేదు. త్వరలో `ఘాటీ`తో ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా మంచి కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందని స్వీటీ కాన్పిడెంట్ గా ఉంది. మరో రెండు..మూడు కథలు విని హెల్డ్ లో పెట్టింది. అందులో ఒకటిగా `ఖైదీ 2` ఉంది. మరి సమంత, అనుష్క ఎంట్రీపై లోకేష్ స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.