రజనీ 'కూలీ' రిజల్ట్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన లోకేష్..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన కూలీ మూవీ కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా రాబట్టింది.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన కూలీ మూవీ కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా రాబట్టింది. కానీ మిక్స్ డ్ టాక్ అందుకుంది. ముఖ్యంగా సినిమా స్టోరీతోపాటు రైటింగ్ పై అనేక విమర్శలు వచ్చాయి.
కథలో డెప్త్ మిస్ అయిందని, రైటింగ్ వీక్ గా ఉందని లోకేష్ కనగరాజ్ పై విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటి వరకు కూలీ విషయంలో సైలెంట్ గా ఉన్న ఆయన.. ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. కూలీ మూవీ విషయంలో తనపై వచ్చిన విమర్శలను స్వీకరిస్తానని తెలిపారు. రజనీ కాంత్ కోసమే అంతా సినిమా చూశారని అన్నారు.
కూలీ సినిమాపై వేలల్లో విమర్శలు వచ్చాయని లోకేష్ కనగరాజ్ అంగీకరించారు. అవన్నీ తాను గమనించానని చెప్పారు. నెక్స్ట్ మూవీ చేసినప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన విమర్శలను చూసుకుని, తప్పులు అన్నీ అప్ కమింగ్ మూవీ విషయంలో సరిదిద్దుకుంటానని తెలిపారు.
కూలీ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా జనాలు థియేటర్లకు కేవలం రజనీకాంత్ కోసమే వెళ్లారని తెలిపారు. అందుకే పెద్ద ఎత్తున వసూళ్లు వచ్చాయని పరోక్షంగా చెప్పారు. తనకు నిర్మాత సినిమా రూ. 500 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారని, కూలీ మూవీని ఆదరించిన ప్రతి ఒక్క అభిమానికి థ్యాంక్స్ చెప్పుకొచ్చారు లోకేష్.
అంతకుముందు ప్రజలు పెట్టుకునే భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని తాను కథలు రాయలేనని తెలిపారు. కానీ తాను రాసింది ఆడియన్స్ ను నచ్చితే చాలా సంతోషమని చెప్పారు. ఓ సినిమా నచ్చకపోతే మళ్ళీ మరో మూవీ విషయంలో ట్రై చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక కూలీ మూవీ విషయానికొస్తే.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా కోసం పెద్ద ఎత్తున స్టార్ క్యాస్టింగ్ ను రంగంలోకి దించారు. రజనీకాంత్ తో పాటు మూవీలో నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సాబిన్ సాహిర్ కీలక పాత్రల్లో నటించారు.
తన స్నేహితుడి ఆకస్మిక మరణం వెనుక కారణాలను తెలుసుకునే దేవ పాత్రలో రజనీకాంత్ సినిమాలో కనిపించారు. తన మార్క్ యాక్షన్ తో అందరినీ అలరించారు. థియేటర్స్ కు ఆయనే ఆడియన్స్ ను రప్పించారు. దీంతో వార్-2 మూవీతో పోటీ ఎదురైనా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించగలిగింది కూలీ మూవీ.