లోకేష్‌ కనగరాజ్‌ ఎందుకు ఇంత స్పెషల్‌..!

కోలీవుడ్‌లోనే కాకుండా దేశం మొత్తం అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్‌.;

Update: 2025-08-09 07:13 GMT

కోలీవుడ్‌లోనే కాకుండా దేశం మొత్తం అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్‌. ఒక యూనివర్శ్‌ ను క్రియేట్‌ చేసుకుని సినిమాలను రూపొందిస్తున్న లోకేష్‌ కనగరాజ్‌ ఈనెల 14న కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందిన 'కూలీ' సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం ఖాయం అనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ సినిమా అయినప్పటికీ లోకేష్‌ కనగరాజ్ సినిమా కావడం వల్లే ఈ స్థాయి బజ్‌ క్రియేట్‌ అయిందని చెప్పడంలో అతిశయం లేదు. కేవలం లోకేష్‌ కనగరాజ్‌ కోసం సినిమాను చూడాలని ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

కూలీ సినిమాతో బాక్సాఫీస్‌ వార్‌

కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్‌లో ఈ సినిమా ఏకంగా ఎన్టీఆర్‌ మూవీ వార్ 2 నే ఢీ కొట్టబోతుంది. లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కూలీ సినిమాకు ఈ స్థాయి బజ్ క్రియేట్‌ కావడానికి లోకేష్ కనగరాజ్‌ ప్రధాన కారణం. ఆయన సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. కూలీ సినిమాకు ముందు ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌, లియో ఇలా అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా లోకేష్ కనగరాజ్‌ తన ప్రతి సినిమాను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాడు. అందుకే ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ కాలమే అయినా అప్పుడే ఏడు సినిమాలను పూర్తి చేశాడు.

స్టార్స్‌, సూపర్‌ స్టార్స్‌తో లోకేష్ కనగరాజ్‌

లోకేష్ కనగరాజ్‌ మరో రెండు మూడు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి రెడీగా పెట్టాడు. సినిమాలు చేసేందుకు లోకేష్ కనగరాజ్‌ ఏ స్థాయి స్పీడ్‌గా ఉంటాడో ఈ లెక్కలు చూస్తే అర్థం అవుతుంది. ఆయన నుంచి మరిన్ని సినిమాలు మరింత స్పీడ్‌గా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఆయన నుంచి వచ్చిన సినిమాలకు హీరోలు సహకరించడం లేదు. ఆయనకు అనుకూలంగా హీరోలు డేట్లు ఇస్తే ఏడాదికి రెండు మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఆమీర్‌ ఖాన్‌, సౌబిన్‌ ఇలా ఎంతో మంది స్టార్స్‌, సూపర్‌ స్టార్స్ ఉన్నప్పటికీ కూలీ సినిమాను తాను అనుకున్నట్లుగా తక్కువ సమయంలోనే పూర్తి చేసి తన సత్తా చాటాడు.

లోకేష్ కనగరాజ్‌ మార్క్‌ మేకింగ్‌

ఈ దర్శకుడు తన ప్రతి సినిమాను బడ్జెట్‌ పరిధిలో రూపొందించడంతో పాటు, తక్కువ రోజుల్లోనే వర్క్‌ ముగిస్తాడు. కూలీ సినిమాను 150 రోజుల లోపు వర్కింగ్‌ డేస్‌ తో పూర్తి చేయడం జరిగింది. ఇక సూపర్‌ స్టార్‌ విజయ్‌ లియో సినిమాను 120 రోజుల్లో పూర్తి చేసినట్లు సమాచారం. మాస్టర్‌ సినిమా సైతం చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి సినిమా కూడా చాలా తక్కువ వర్కింగ్‌ డేస్‌లోనే పూర్తి చేయడం జరిగింది. అందుకే లోకేష్‌ కనగరాజ్ చాలా స్పెషల్‌ అంటారు.

వంద రోజుల లోపు సినిమాలు చేసి కూడా సూపర్‌ హిట్‌ చేసిన ఘనత లోకేష్ కనగరాజ్‌ సొంతం. అందుకే సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ చాలా స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. వందల కోట్ల వసూళ్లు సాధించే సినిమాలను చాలా తక్కువ సమయంలోనే లోకేష్ తీయగలడు. ఇతర దర్శకులు వందల కోట్ల బడ్జెట్‌తో, ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం ఎంత పెద్ద స్టార్‌తో అయినా ఇలా తీసేస్తాడు. అందుకే లోకేష్ చాలా స్పెషల్‌.

Tags:    

Similar News