• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కుబేర' హైప్‌కి కార‌ణం...

'కుబేర' హైప్‌కి కార‌ణం త‌నేనా?

| త‌మిళ వెర్స‌టైల్ స్టార్ ధ‌నుష్ హీరోగా న‌టించిన ఎమోష‌న‌ల్ డ్రామా `కుబేర‌`. తెలుగులో ధ‌నుష్ న‌టించిన రెండ‌వ సినిమా ఇది.

By - Tupaki Desk
Update: 2025-06-09 05:32 GMT

త‌మిళ వెర్స‌టైల్ స్టార్ ధ‌నుష్ హీరోగా న‌టించిన ఎమోష‌న‌ల్ డ్రామా `కుబేర‌`. తెలుగులో ధ‌నుష్ న‌టించిన రెండ‌వ సినిమా ఇది. సెన్సిబుల్ మూవీస్‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న శేఖ‌ర్ క‌మ్ముల ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించ‌గా, క‌థ‌కు కీల‌క‌మైన క్యారెక్ట‌ర్‌లో కింగ్ నాగార్జున న‌టించడం గ‌మ‌నార్హం. ఉత్త‌రాది మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకుని హిందీ న‌టుల‌ని కూడా కీల‌క పాత్ర‌ల కోసం తీసుకున్నారు.

ఓ బిచ్చ‌గాడికి ఓ అప‌ర కోట‌శ్వ‌రుడికి మ‌ధ్య సాగే స‌మ‌రం నేప‌థ్యంలోనే ఈ సినిమా ఉంటుంద‌ని, బిచ్చ‌గాడుగా ధ‌నుష్‌, కోటీశ్వ‌రుడిగా కింగ్ నాగార్జున న‌టిస్తున్నార‌ని, వ‌రిద్ద‌రి క్యారెక్ట‌ర్స్ సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ ఈ నెల 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ప్రారంభించిన టీమ్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నారు.

అయితే సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ సినిమాపై క్రేజ్ మ‌రింత‌గా పెరుగుతూ వ‌స్తోంది. మ‌రో విశేషం ఏంటంటే ఈ సినిమా ఆంధ్రా హ‌క్కుల‌ను భారీ మొత్తంలో కోట్ చేయ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ రికార్డు స్థాయికి చేరుకునే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల క‌థ‌నం. గ‌తంలో ధ‌నుష్ సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద‌గా హైప్ ఉండేది కాదు. కానీ `కుబేర`కు మాత్రం విప‌రీత‌మైన హైప్ క్రియేట్ అవుతోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం కింగ్ నాగార్జున అని తెలుస్తోంది. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. అదే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో హైప్‌ని, బిజినెస్ ప‌రంగా భారీ క్రేజ్‌ని క్రియేట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. బిజినెస్ ప‌రంగా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫ‌లితం విష‌యంలో అక్కినేని అభిమానులు చాలా క‌న్ఫిడెంట్‌గా ఉన్నార‌ట‌.

దీనికి తోడు `ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌`, సార్ వంటి సినిమాల‌తో ధ‌నుష్ కూడా తెలుగులో మంచి మార్కెట్‌ని క్రియేట్ చేసుకోవ‌డం, వీరిద్ద‌రి స్టార్ ఇమేజ్‌కు శేఖ‌ర్ క‌మ్ముల క్రేజ్ కూడా తోడ‌వ్వ‌డంతో `కుబేర‌` షూర్ షాట్ హిట్ అని అంతా ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతా అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించ‌డం ఖాయం అని ఇన్ సైడ్ టాక్‌. ప్రీ రిలీజ్ బ‌జ్ ప‌తాక స్థాయికి చేరిన ఈ మూవీ జ‌న్ 20న అంతా ఆశించిన‌ట్టుగానే బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే.

Tags:    
  • Kuberaa 
  • Dhanush 
  • KingNagarjuna 
  • RashmikaMandanna 
  • ShekharKammula 
  • PanIndiaMovie 
  • TeluguCinema 
  • TamilStar 
  • EmotionalDrama 
  • KuberaBuzz 
  • BlockbusterWatch 
  • TollywoodBusiness 
  • Jan20Release 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS