ధనుష్ ‘కుబేర’ - అనుమానాలకు ఎండ్ కార్డ్!

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.;

Update: 2025-05-22 15:14 GMT
ధనుష్ ‘కుబేర’ - అనుమానాలకు ఎండ్ కార్డ్!

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ డిఫరెంట్ థ్రిల్లర్ లో నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్, దలీప్ తాహిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ లాంటి హిట్స్‌తో అలరించిన శేఖర్ కమ్ముల ఈసారి కంప్లీట్ గా జానర్ మార్చేశాడు. ఈ సినిమా సందేశాత్మక కథతో ఆడియన్స్‌ను మెప్పించనుందని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ‘కుబేర’ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. గ్లింప్స్‌లో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో, నాగార్జున ఒక పోలీస్ ఆఫీసర్ గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించారు. ఈ సినిమా సంపద, ఆశ, నైతిక సందిగ్ధతల చుట్టూ తిరుగుతుందని, పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామా హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.

త్వరలో మరో టీజర్ రిలీజ్ కానుందని, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచనుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే ‘కుబేర’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇటీవల పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రచారంలో నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. అంతే కాకుండా అఫీషియల్ గా డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది.

ముందుగా ప్రకటించిన జూన్ 20వ తేదీనే సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపింది. అసలైతే గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్నట్లు షూటింగ్ ఫినిష్ కాలేదు. ఇక సమ్మర్ లో కూడా ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో జూన్ లో పర్ఫెక్ట్ ప్లాన్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ముంబై, బ్యాంకాక్, గోవా, తిరుపతి వంటి ప్రాంతాల్లో జరిగింది.

పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి, ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి నుంచి మాఫియా కింగ్‌గా మారే పాత్రలో కనిపించనున్నాడని, నాగార్జున ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని సమాచారం. రష్మిక మందన్న పాత్ర కూడా మిడిల్ క్లాస్ నేపథ్యంతో ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా, ‘కుబేర’ సినిమా శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషనల్ డ్రామాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక బాక్సాఫీస్ వద్ద విడుదల అనంతరం ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News