• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ అనుభవం నేను ఫేస్...

ఆ అనుభవం నేను ఫేస్ చేశాను..బిగ్ బాస్ కిరక్ సీత వైరల్ స్టేట్మెంట్..

| బిగ్ బాస్ హడావిడి మొదలు కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇంటి ముచ్చట్లే ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-09-11 22:30 GMT

తెలుగింటి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ హడావిడి మొదలు కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇంటి ముచ్చట్లే ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కొత్త కంటెస్టెంట్స్ సరికొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అలా ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్స్ లో ఒకరు కిరాక్ సీత. యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయమై బేబీ సినిమా ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తనదైన గేమ్ ఆడుతోంది.

అనునిత్యం ట్విస్టులతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న ఈ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇలా షో మొదలైందో లేదో అప్పుడే మొన్న ఆదివారం ఫస్ట్ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. బెజవాడ బేబక్క బయటకు వెళ్లిపోవడంతో ఇప్పుడు హౌస్ లో 13 మంది మిగిలారు.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 13 మందికి సంబంధించిన ఎన్నో పాత విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కిర్రాక్ సీతకు సంబంధించి ఓ పాత వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.

బేబీ మూవీ అనంతరం బాగా పాపులర్ అయిన కిరాక్ సీత అప్పట్లో వరుస ఇంటర్వ్యూలో కూడా పాల్గొంది. ఈ నేపథ్యంలో తను ప్రొఫెషనల్ గా ఎన్ని సవాళ్లు ఎదుర్కొందో ఆమె ఒక సందర్భంలో వివరించింది. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా ఆ వీడియోలో పంచుకుంది.. ఈతరం అమ్మాయిల్లో చాలామందికి ఉన్నట్టుగానే.. కిర్రాక్ సీత కూడా ఓ చిన్ని బ్రేకప్ స్టోరీ ఉందట.

ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సీత.. తన జీవితంలో బ్రేకప్ స్టోరీ ఉండబట్టి బేబీ మూవీ తనకు బాగా కనెక్ట్ అయిందేమో అంటు చెప్పుకొచ్చింది. ఐదేళ్ల పాటు ఒక అబ్బాయిని ప్రేమించిన సీత పెళ్లి కూడా చేసుకోవాలని కలలు కనిందట. కానీ అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పేసాడు. కేవలం పెద్దలను నొప్పించడం ఇష్టం లేక ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నారు తప్ప మోసం చేసుకోవడం లాంటివి ఏమీ లేవట.పాపం పర్సనల్ అయిపోయింది కష్టాలు పడినా సీత ప్రొఫెషనల్ గా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు సీతకి కూడా ఎదురయ్యాయి.’ఒక సినిమాలో చేయడానికి ఆఫర్ ఉంది.. 25 లక్షల వరకు పారితోషకం ఇస్తారు కానీ ఈ మూవీలో మీకు ఛాన్స్ రావాలి అంటే ఫామ్ హౌస్ లో నిర్మాతను ఒకసారి కలవాలి.. అతనితో కలిసి ఫారిన్ టూర్ కి కూడా వెళ్లాలి’ అని సీతను ఒకరు అప్రోచ్ అయ్యారట. అసలు విషయం అర్థమైంది సీత ఆఫర్ వద్దని చెప్పేసిందట. బిగ్ బాస్ లో ఇప్పుడు సీత యాక్టివ్ గా ఉండడంతో తిరిగి ఆమెకు సంబంధించిన ఈ విషయాలు అన్నీ వైరల్ అవుతున్నాయి.

Tags:    
  • Kirrakseetha 
  • Biggbosstelugu 
  • Kirrakseethacareer 
  • Babymovie 
  • Filmindustry 
  • Castingcouch 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS