కిరణ్ అబ్బవరం.. సైలెంట్ గా పెద్ద ప్లానే..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే

Update: 2024-05-10 11:53 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి పరిశ్రమలోకి అడుగు పెట్టారు కిరణ్. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా సినిమాలు చేశారు.

2019లో 'రాజావారు రాణిగారు' మూవీ విడుదలైన తర్వాత.. కిరణ్ యాక్ట్ చేసిన 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో కిరణ్ కు మంచి క్రేజ్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా కనెక్ట్ కావడం లేదు. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ పెట్టారు కిరణ్.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో రుక్సార్ ధిల్లోన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. 2024లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కాకుండా ఆయన చేతిలో మరో మూవీ లేదు. కొన్ని నెలలుగా ఎలాంటి సినిమా ప్రకటన కూడా చేయలేదు. అయితే కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం సైలెంట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారట.

Read more!

ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న కిరణ్.. క్రేజీ ప్రాజెక్టులతో గ్రాండ్ గా సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలెంటెడ్ మేకర్స్ తో సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇవ్వనున్నారని సమాచారం. దీంతో కిరణ్ కొత్త మూవీలపై అందరి దృష్టి పడింది.

ఇక కిరణ్ అబ్బవరం.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. తన ఫస్ట్ మూవీలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్‏ తో మరికొద్ది నెలల్లో ఏడడుగులు వేయనున్నారు. ఇటీవల వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. కిరణ్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ యంగ్ హీరో పెళ్లి డేట్ కోసం, కొత్త మూవీల అనౌన్స్మెంట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News