టాక్సిక్ కియరా నాడియా లుక్కు అదిరింది..!
కె.జి.ఎఫ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టాక్సిక్. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.;
కె.జి.ఎఫ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టాక్సిక్. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మార్చి 19న రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఐతే ఈ సినిమా నుంచి హీరోయిన్ కియరా అద్వాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కియరా అద్వాని సినిమాలో నాడియా రోల్ లో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
కె.జి.ఎఫ్ తో నేషనల్ వైడ్ గా యష్..
కియరా ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్ తో నాడియా రోల్ లో కనిపించబోతుంది. అంతేకాదు సినిమాలో ఈ రోల్ చాలా కీలకమని తెలుస్తుంది. టాక్సిక్ సినిమాను యష్ తో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కె.జి.ఎఫ్ తో నేషనల్ వైడ్ గా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న యష్ నెక్స్ట్ రాబోతున్న టాక్సిక్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా నుంచి అప్పట్లో ఒక టీజర్ రాగా అది ఇంప్రెస్ చేసింది.
ఇక టాక్సిక్ నుంచి కియరా లుక్ ఇంట్రెస్ట్ ని డబల్ చేసింది. కియరా అద్వాని కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. రీసెంట్ గా వార్ 2 లో హృతిక్ రోషన్ కి జతగా నటించిన ఈ అమ్మడు ఆ సినిమాతో భారీ హిట్ ఎక్స్ పెక్ట్ చేసింది. ఐతే అది టార్గెట్ మిస్ అయ్యింది. ఐతే యష్ టాక్సిక్ తో మాత్రం గురి తప్పకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతుంది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది.
కియరా బీ టౌన్ ఫ్యాన్స్ కి..
యష్ టాక్సిక్ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాను సమ్మర్ కు ముందు అంటే మార్చిలోనే రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే యష్ టాక్సిక్ గురించి ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ నుంచి రాబోతున్న మరో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా టాక్సిక్ మీద మంచి హైప్ ఏర్పడింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
ఇక కియరా బీ టౌన్ ఫ్యాన్స్ కి అయితే టాక్సిక్ నుంచి వచ్చిన పోస్టర్ అయితే ఫుల్ ఖుషి చేసింది. అమ్మడు ఈ సినిమాతో మరోసారి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. టాక్సిక్ మీదే కియరా అన్ని హోప్స్ పెట్టుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న ప్రతి స్టార్ నెక్స్ట్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ తో యష్ కూడా అంచనాలను అందుకుంటాడా లేదా అన్నది మార్చి 19న తెలుస్తుంది. యష్ మాత్రం టాక్సిక్ తో కె.జి.ఎఫ్ ని మించి సక్సెస్ కొట్టేస్తామన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.