కేసరి ఛాపర్ట్-2 ఎలా ఉందంటే?
సినిమా రిలీజ్ కు ముందే కొద్ది రోజుల పాటు ట్రెండింగ్ లో ఉన్న మూవీ.. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ టాక్ ఎలా ఉందంటే?;
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో రీసెంట్ గా నటించిన మూవీ కేసరి ఛాప్టర్-2. అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్ లైన్ తో కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించగా.. మాధవన్, అనన్యపాండే కీలకపాత్రలు పోషించారు. సినిమా రిలీజ్ కు ముందే కొద్ది రోజుల పాటు ట్రెండింగ్ లో ఉన్న మూవీ.. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ టాక్ ఎలా ఉందంటే?
1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ లో ఏం జరిగింది? ఆ రోజు మారణహోమంలో ఎంత మంది మరణించారు? బ్రిటిష్ సామ్రాజ్యం దానిని ఎలా కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది? జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్ కథ ఏమిటి? ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు న్యాయం చేయడానికి సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ ఎలా పోరాడాడు? అన్నదే పూర్తి సినిమా.
అయితే సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ రోల్ లో అక్షయ్ కుమార్ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో బార్ కౌన్సిల్ సన్నివేశంలో ఆయన నటన వేరే లెవెల్. మాధవన్, అనన్య, రెజీనా తమ పాత్రలకు న్యాయం చేశారు. సైమన్ పైస్లీ డే తన యాక్టింగ్ తో సినిమాలో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు.
మూవీలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. థియేటర్స్ లో చప్పట్లు హోరెత్తుతున్నాయి. దేబోజీత్ రే సినిమాటోగ్రఫీ సూపర్ అనే చెప్పాలి. ఆయన వర్క్ ఆకట్టుకుంటోంది. శశ్వత్ సచ్దేవ, కవితా సేథ్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు కరెక్ట్ గా సరిపోయాయి. దర్శకుడు కరణ్ సింగ్ వర్క్ తన మేకింగ్, టేకింగ్, రైటింగ్ తో ఆడియన్స్ ను మెప్పించారు.
గతంలో జలియన్ వాలాబాగ్ మారణహోమాన్ని పలువురు మేకర్స్ తమ సినిమాల్లో చూపించారు. కానీ కేసరి చాప్టర్ 2 అనేది ఆ మారణహోమం ఆధారంగా తీసిన మొదటి పూర్తి స్థాయి సినిమా అనే చెప్పాలి. అనేక సీన్స్ చూసి చలించిపోయామని కొందరు సినీ ప్రియులు.. సోషల్ మీడియలో రివ్యూస్ ఇస్తున్నారు.
ఏదేమైనా సినిమాలో కోర్టు సీన్స్, క్లైమాక్స్ సీక్వెన్స్, అక్షయ్ కుమార్ యాక్టింగ్, పలువురు నటీనటుల టాలెంట్, కరణ్ త్యాగి డైరెక్షన్, రాసుకున్న డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయని చెబుతున్నారు. అయితే కొన్ని సినిమాటిక్ లిబర్టీలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ సూపర్ అని కొనియాడుతున్నారు.