కాక‌పుట్టించేలా హీరోతో కీర్తి సురేష్ లిప్ లాక్!

ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి 'బేబి జాన్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కీర్తి - వ‌రుణ్ తో ఇంటిమేట్ స‌న్నివేశాలు..పెద‌వి ముద్దుల్లోనూ చెల‌రేగుతుంద‌ని స‌మాచారం.

Update: 2024-05-17 07:45 GMT

కీర్తి సురేష్ అలియాస్ మ‌హాన‌టి ఛేంజోవ‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌డిక‌ట్టుకుని కూర్చుంటే ప‌న‌వ్వ‌ద‌ని ఆల‌స్యంగా గ్ర‌హించినా కొత్త క‌మిట్ మెంట్ల‌తో ఆ గ్యాప్ ని వీలైనంత త్వ‌ర‌గా పుల్ ఫిల్ చేసే ప‌నిలో ప‌డింది. కొత్త‌గా ఏ సినిమాలు క‌మిట్ అయినా! అన్నింటికి సై అంటూ ముందుకెళ్లిపోతుంది. 'స‌ర్కారు వారి పాట‌'తో ఆ సంగ‌తి అంద‌రికీ అర్ద‌మైంది. ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ లో అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డ‌కి త‌గ్గ‌ట్టు అమ్మ‌డు మౌల్డ్ అవుతుంది.

ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి 'బేబి జాన్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కీర్తి - వ‌రుణ్ తో ఇంటిమేట్ స‌న్నివేశాలు..పెద‌వి ముద్దుల్లోనూ చెల‌రేగుతుంద‌ని స‌మాచారం. ఘాడ‌మైన లిప్ లాక్ ద‌ర్శ‌కుడు త‌ప్ప‌నిస‌రిగా భావించ‌డంతో ఎలాంటి అడ్డంకులు చెప్ప‌కుండా ఎస్ చెప్పింద‌ని బాలీవుడ్ లో మీడియాలో ప్ర‌చారం ఊపందుకుంది. ఈ స‌న్నివేశాలు ఎంతో రియ‌లిస్టిక్ గా ఉంటాయ‌ని...సినిమాలో హైలైట్ గాను నిలుస్తాయ‌ని స‌మాచారం.

Read more!

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ త‌ర‌హా అటెంప్ట్ లు కీర్తి చేయ‌లేదు. తెలుగు లో స్కిన్ షో చేసింది త‌ప్ప‌! ముద్దులు..ముచ్చ‌ట‌కు దూరంగానే ఉంది. కానీ బాలీవుడ్ లో అలా ఉంటానంటే ప‌న‌వ్వ‌దు కాబట్టి విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. అలాగే 'అక్క' అనే ఓ వెబ్ సిరీస్ కూడా క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఏకంగా హాట్ బాంబ్ రాధికా ఆప్టేతోనే పోడీ ప‌డుతుంది. ఆమె తో హాట్ అప్పిరియ‌న్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు న్యూడ్ గాను న‌టించిన సిరీస్ లు ఉన్నాయి. పెద‌వి ముద్దులు..స్కిన్ షోలు లాంటివి రాధిక‌కు పెద్ద‌గా లెక్క‌లోకి రావు.

అలాంటి భామ‌తో కీర్తి పోటీ ప‌డాలంటే తానెంత ప్రిపేర్ అయి ఉండాల‌న్న‌ది గెస్ చేయోచ్చు. అందుకు అన్ని ర‌కాలుగా సంసిద్ద‌మ‌య్యే రంగంలోకి దిగింది. అలాగే కీర్తి సురేష్ టాలీవుడ్ కి బైబై చెప్పేస్తుంద‌ని కూడా ప్ర‌చారంలో ఉంది. తెలుగు సినిమాల‌కంటే హిందీ సినిమాల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంద‌ని..అందుకే నార్త్ ఆడియ‌న్స్ కోసం గ్లామ‌ర్ గేట్లు కూడా తెరుస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఆ సంగ‌తేంటో తేలాలి.

Tags:    

Similar News