నిజ జీవితంలో కీర్తి సురేష్ అమాయకురాలు!
అపూర్వ పాత్ర కూడా అలాగే ఉంటుందంది. ఆద్యంతం నవ్వించే రోల్ అని తెలిపింది. అన్నింటికంటే కామెడీ పండించడం కష్టమంది.;
కీర్తి సురేష్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన ఏ అవకాశం విడిచి పెట్టడం లేదు. ఆ ఛాన్స్ చిన్నదా? పెద్దదా? అన్నది ఆలోచించకుండా కమిట్ అవుతుంది. నటిగా అన్ని రకాల పాత్రలు పోషించాలి. నటికి నిబంధనలు దేనకంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. కొన్నిసార్లు తారసపడే పాత్రలు మాత్రం వాస్తవ జీవితాన్ని చూపిస్తుంటాయి.
ఆ పాత్రలు రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. ప్రతీ నటి ప్రయాణంలో ఏదో ఒక దశలో ఇలాంటి అనుభ వాన్ని ఎదుర్కుంటారు. తాజాగా కీర్తి సురేష్ కూడా 'ఉప్పు కప్పు రంబు' లో ఆ అనుభూతి పొందింది. ఇందులో అమ్మడు అపూర్వ అనే పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర తన వాస్తవజీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. రియల్ లైఫ్ లో తానెంతో అమాయకురాలు అట. ఇంట్లో వాళ్లు అంతా అలా అంటున్నప్పుడే తనకు ఆ విషయం తెలిసిందది.
అపూర్వ పాత్ర కూడా అలాగే ఉంటుందంది. ఆద్యంతం నవ్వించే రోల్ అని తెలిపింది. అన్నింటికంటే కామెడీ పండించడం కష్టమంది. 'ఒకర్ని ఏడిపించడం సులభం. కానీ నవ్వించడం చాలా కష్టమైన పని. ఈ సినిమా కంటే ముందు రఘుతాత చేసా. అదో రకమైన కామెడీ చిత్రమది. ప్రయోగాలు చేయాలంటే ఆసక్తి ఎక్కువ. విభిన్నమైన కథా నేపథ్యమున్న సినిమాలు చేయాలి. 'ఉప్పుకప్పు రంబు' నా ముందుకు అలా వచ్చింది.
కామెడీ చిత్రం ...నాకు రాకపోయినా పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నధం అయ్యాను. ఊరి పెద్దగా బాధ్య తలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు అర్దం చేసుకుని సమస్యల పరిష్కారం కోసం ఏం చేసిందన్నదే కథ' గా కీర్తి సురేష్ రివీల్ చేసింది.