బాలీవుడ్ కు వెళ్లడానికి కార‌ణ‌మ‌దే!

కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే త‌న చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకున్నారు కీర్తి. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ చేయ‌నున్న‌ట్టు కీర్తి ఇప్ప‌టికే చెప్పారు.;

Update: 2025-09-17 10:30 GMT

కీర్తి సురేష్.. సౌత్ స్టార్ హీరోయిన్ గా వ‌రుస పెట్టి సినిమాలు చేసిన అమ్మ‌డు ఓ వైపు హీరోయిన్ గా క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ చేస్తూనే మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా ఆడియ‌న్స్ ను మెప్పిస్తూ వ‌స్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే త‌న చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకున్నారు కీర్తి. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ చేయ‌నున్న‌ట్టు కీర్తి ఇప్ప‌టికే చెప్పారు.

పెళ్లి త‌ర్వాత స్లో అయిన కీర్తి బండి

అయితే కీర్తి చెప్ప‌డ‌మైతే చెప్పారు కానీ పెళ్లి త‌ర్వాత అమ్మ‌డు కొత్త సినిమా సైన్ చేయ‌డానికి చాలానే టైమ్ తీసుకున్నారు. కీర్తి ఆల్రెడీ పెళ్లికి ముందు క‌మిట్ అయిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి త‌ప్పించి ఇంత‌కుముందులా వ‌రుస పెట్టి సినిమాల‌నైతే లైన్ లో పెట్ట‌డం లేదు. రీసెంట్ గా మిస్కిన్ తో క‌లిసి చేయ‌బోయే సినిమాను త‌ప్పించి మ‌రో సినిమాను అనౌన్స్ చేయ‌లేదు కీర్తి.

ఇంకా చాలా జ‌ర్నీ చేయాలి

దీంతో కీర్తి కెరీర్ లో స్పీడు త‌గ్గించారా లేక పెళ్లి త‌ర్వాత అమ్మ‌డికి అవ‌కాశాలు రావ‌డం లేదా అనుమానాలు అంద‌రిలోనూ ఎక్కువ‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న సినిమాల గురించి, నెక్ట్స్ చేయ‌బోయే మూవీస్ గురించి మాట్లాడారు కీర్తి సురేష్. ఇండ‌స్ట్రీలో తాను ఇంకా చాలా జర్నీ చేయాల్సి ఉంద‌ని, అందుకే తొంద‌రప‌డి సినిమాలు చేయ‌డం లేద‌ని తెలిపారు.

కొత్త‌ జ‌ర్నీని ఆస్వాదిస్తున్నా

ఓ వైపు గ్లామ‌ర్ రోల్స్ చేస్తూనే మ‌రోవైపు న‌ట‌నా ప్రాధాన్య‌మున్న సినిమాలు చేసేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాన‌ని, బాలీవుడ్ లో చేసిన బేబీ జాన్ త‌న కెరీర్లోనే కొత్త ఛాప్ట‌ర్ అని, త‌న‌ను ఛాలెంజ్ చేసే క్యారెక్ట‌ర్లు, కొత్త క‌థ‌ల కోసం మాత్ర‌మే తాను బాలీవుడ్ కు వెళ్లాన‌ని, అక్క‌డ వ‌ర్క్, క‌ల్చ‌ర్ చాలా కొత్త‌గా ఉన్నాయ‌ని, అవ‌న్నీ తెలుసుకుంటూ కెరీర్లో కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటున్నాన‌ని, ఈ జ‌ర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నా అని కీర్తి పేర్కొన్నారు.

Tags:    

Similar News