• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓ వైపు నాన్న కల.. అతనేమో...

ఓ వైపు నాన్న కల.. అతనేమో కమిట్మెంట్ అడిగాడు.. చేసేదేం లేక..!

| తాను మోడల్ గా చేస్తున్న కొత్తలో ఒకత ను ఆఫర్ ఇస్తానని చెప్పి ఆఫీస్ కి ఆడిషన్ కి పిలిచాడు.

By - Tupaki Desk
Update: 2024-11-15 04:01 GMT

తెలుగు తెర మీద కొత్త అందం వరుస సినిమాలతో అలరిస్తూ వస్తుంది. ఆమె మోడల్ కం యాక్ట్రెస్ కావ్యా థాపర్. తాను నటిని అవ్వాలన్నది నాన్న కల అందుకే సినిమాల్లోకి వచ్చానని.. ముందు మోడల్ గా మారి ఆ తర్వాత మూవీస్ చేస్తున్నానని అన్నారు. ఐతే మోడల్ గా ఉన్నప్పుడే తనకు ఎదురైన చేదు అనుభవాలను రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు కావ్యా థాపర్. తాను మోడల్ గా చేస్తున్న కొత్తలో ఒకతను ఆఫర్ ఇస్తానని చెప్పి ఆఫీస్ కి ఆడిషన్ కి పిలిచాడు.

ఆ టైం లో అతను కమిట్మెంట్ ఇస్తే నాలుగు యాడ్స్ ఆఫర్ ఇస్తానని అన్నాడు. ఐతే తనకు మొహం మీదే నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని తిరిగి వచ్చేశానని చెప్పారు కావ్యా థాపర్. ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా సహజమని అప్పుడే అర్ధమైందని అన్నారు కావ్యా థాపర్. తాను నటించి అవ్వాలన్నది నాన్న కల అందుకే ఎలాంటి కష్టం వచ్చినా సరే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా అని అన్నారు.

ఐతే కావ్య మొదటి సినిమా ఈ మాయ పేరేమిటో సక్సెస్ అవ్వగా ఆ తర్వాత సంతోష్ శోభన్ తో చేసిన ఏక్ మిని కథ కూడా సక్సెస్ అందుకుంది. ఐతే ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం విశేషం. అక్కడి నుంచి ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, లేటెస్ట్ గా వచ్చిన విశ్వం సినిమాల్లో నటించింది అమ్మడు. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తీసిన టైం లోనే ఆ సినిమాలో ఛాన్స్ కోసం ఆడిషన్ ఇచ్చింది కావ్యా థాపర్.

ఐతే అప్పుడు ఆ ఛాన్స్ అందుకోలేని అమ్మడు ఆ సినిమా సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ లో ఛాన్స్ అందుకుంది. ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో ఊరుపేరు భైరవకోన పర్వాలేదు అనిపించుకోగా విశ్వం జస్ట్ ఓకే అన్నట్టు ఆడింది. ఇక మిగతా సినిమాలన్నీ నిరాశ పరచాయి. ఐతే సినిమా ఫలితం ఏదైనా సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుకుంటే చాలని అంటుంది అమ్మడు.

సినిమాలే కాదు కావ్యా థాపర్ సోషల్ మీడియాని కూడా హీటెక్కించే రేంజ్ లో ఫోటో షూట్స్ చేస్తుంది. గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకోవాలని బాగా తహతహలాడుతున్న కావ్యా థాపర్ స్కిన్ షోలో అస్సలు తగ్గేదేలేదు అన్నట్టుగా కనిపిస్తుంది. గ్లామర్ పరంగా అదరగొట్టే అమ్మడు సినిమాలతో కూడా సక్సెస్ అందుకుంటే కెరీర్ గాడిన పడినట్టే లెక్క.

Tags:    
  • Kavyathapar 
  • Actress 
  • Doubleismart 
  • Viswam 
  • Ekminikatha 
  • Kavyathaparmovies 
  • Tollywood 
  • Commitment 
  • Filmindustry 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS