పిల్ల‌ల హ‌క్కులు..భ‌విష్య‌త్ త‌రం కోసం క‌రీనా!

ఇక సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ క‌రీనా ఎంతో యాక్టివ్ గా పాల్గొంటారు.

Update: 2024-05-05 16:30 GMT

బాలీవుడ్ న‌టి క‌రీనా కపూర్ కెరీర్ రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ఎంతో మంది స్టార్ హీరోల‌తో న‌టించింది. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించి న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించు కున్నారు. లేడీ ఓ రియేంటెడ్ పాత్ర‌ల‌తోనూ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఘ‌త‌న ఆమె సొంతం. ఇక సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ క‌రీనా ఎంతో యాక్టివ్ గా పాల్గొంటారు. ఎన్నో జాతీయ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు సైతం మ‌ద్ద‌తుగా నిలిచారు.

తాజాగా యూనిసెఫ్‌ (యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF‌) ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌గా కరీనా కపూర్‌ను నియామ‌క‌మయ్యారు. పిల్ల‌ల హ‌క్కుల‌పై..భ‌విష్య‌త్ త‌రాల కోసం..విద్య..లింగ స‌మాన‌త్వం వంటి అంశాల‌పై క‌రీనాం యూనిసెఫ్ త‌రుపున ప్ర‌చారం చేయ‌నున్నారు. గత పదేళ్లుగా కరీనాకు యూనిసెఫ్‌తో అనుబంధం ఉంది. 2014 నుంచి ఆమె యూనిసెఫ్‌ సెలెబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కరీనా ఉద్వేగంతో ప్రసంగించారు. తనను యూనిసెఫ్‌ ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌గా నియమించడం చాలా గర్వంగా ఉందన్నారు. దేశంలోని మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తున్న బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన పిల్ల‌ల కోసం ప‌ని చేయ‌డంలో త‌న వంతు కృషీ ఎప్పుడూ ఉంటుంద‌న్నారు. కరీనా కపూర్‌ నేషనల్ అంబాసిడర్‌గా ఎన్నికవడంతో యూనిసెఫ్‌ ఇండియాలో కొత్త ఉత్సాహం నిండిందని యూనిసెఫ్‌లో భారత ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రే అన్నారు.

Read more!

ఇక క‌రీనా వృత్తిగ‌త జీవితం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో బ్రాండ్ హీరోయిన్ . ఇటీవ‌లే `ది క్రూ`తో మ‌రో భారీ విజ‌యం ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రం గా రిలీజ్ అయిన సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ప్ర‌స్తుతం `సింగం ఎగైన్` లో న‌టిస్తోంది. ఈసినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అలాగే అమ్మ‌డు కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు క‌మిట్ అయింది. వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా రివీల్ చేయ‌నుంది.

Tags:    

Similar News