18 ఏళ్లుగా కరీనాకు అదే క్రమశిక్షణ
ఎవర్ గ్రీన్ యాక్టింగ్ తో ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న కరీనా, ఇప్పటికీ పాతికేళ్ల పడుచులకు కాంపిటిషన్ గా నిలుస్తూ ఉంటారు.;
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవర్ గ్రీన్ యాక్టింగ్ తో ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న కరీనా, ఇప్పటికీ పాతికేళ్ల పడుచులకు కాంపిటిషన్ గా నిలుస్తూ ఉంటారు. ఫిట్ నెస్ విషయంలో ఎంతో క్రమశిక్షణగా ఉండే కరీనా ఎంతో మంచి లైఫ్ స్టైల్ ను పాటిస్తూ ఉంటారు. సైజ్ జీరోకు సరైన నిర్వచనంలా అనిపించే కరీనా కపూర్ గురించి ఆమె డైటీషియన్ రుజుత దివికర్ ఓ విషయాన్ని బయటపెట్టారు.
రుజుత గత కొన్నేళ్లుగా కరీనా వద్ద డైటీషియన్ గా ఉంటున్నారు. కరీనా గత 18 సంవత్సరాలుగా ఒకే రకమైన డైట్ ను ఫాలో అవడం వల్లే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయినా, 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ నాజూగ్గా ఉన్నారని రుజుత అసలు సీక్రెట్ ను బయటపెట్టారు. కరీనా తన డే ను ముందు డ్రై ఫ్రూట్స్ తో స్టార్ట్ చేసి, ఆ తర్వాత వ్యాయమం చేస్తారని రుజుత తెలిపారు.
వర్కవుట్స్ తర్వాత ఫ్రెష్ అయి, బ్రేక్‌ఫాస్ట్ గా పోహా లేదంటే పరాటా తింటారట. మధ్యాహ్నం లంచ్ లోకి కచ్ఛితంగా అన్నం, పప్పూ తినే కరీనా కొన్నిసార్లు ఈవెనింగ్స్ టైమ్ లో చీజ్ టోస్ట్ తింటారని, వీటితో పాటూ ఆయా సీజన్స్ లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ ను తింటూంటారని, సమ్మర్ లో అయితే మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటారని రుజుత చెప్పారు.
డిన్నర్ లో నెయ్యితో చేసిన కిచిడీ లేదా పులావును తీసుకుంటారని, షూటింగ్ లో ఉంటే మెనూలో కొన్ని మార్పులుంటాయని చెప్పారు. కనీసం వారంలో 5 సార్లు అయినా కరీనా.. నెయ్యితో చేసిన కిచిడీ తినాల్సిందేనని, ఆమెకు కిచిడీ అంటే అంతిష్టమని రుజుత చెప్పారు. గతంలో కరీనా కూడా తనకు కిచిడీ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు వెల్లడించారు.
10-15 రోజుల పాటూ రోజూ అన్నం, పప్పు, పెరుగన్నం చేసి తన కుక్ విసిగిపోతాడని, కానీ తనకు మాత్రం రోజూ అదే తిన్నా బోర్ కొట్టదని కరీనా చెప్పారు. సాయంత్రం 6 గంటలకే తన డిన్నర్ అయిపోతుందని, రాత్రి 9.30కు ఏదేమైనా నిద్ర పోవాల్సిందేనని చెప్పిన కరీనా తన ఫ్రెండ్స్ తనను నైట్ పార్టీలకు పిలవడం మానేశారని చెప్పారు. అందరూ నిద్ర లేవకముందే తన వర్కవుట్స్ అయిపోతాయని, తన ఫిట్‌నెస్, బాడీ చూసి అందరూ తాను క్వినోవా తీసుకుంటాననుకుంటారని, కానీ అందులో ఎలాంటి నిజం లేదని కరీనా అసలు విషయం చెప్పుకొచ్చారు.