క‌పూర్ ఫ్యామిలీలో ఒక‌రితో రొమాన్స్ చేసాడ‌ట‌

బుల్లితెర చిట్ చాట్‌లు సెల‌బ్రిటీ లైఫ్ లో చాలా బ‌య‌టికి తెలియ‌ని విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేస్తున్నాయి.;

Update: 2025-10-24 16:30 GMT

బుల్లితెర చిట్ చాట్‌లు సెల‌బ్రిటీ లైఫ్ లో చాలా బ‌య‌టికి తెలియ‌ని విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేస్తున్నాయి. పాపుల‌ర్ టీవీ షో `కాఫీ విత్ క‌ర‌ణ్` చాలా మంది సెల‌బ్రిటీల గుట్టు మ‌ట్ల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఇటీవ‌ల `టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్` కార్య‌క్ర‌మం అదే కోవ‌లో చేరిపోయింది.

ఇప్పుడు ఈ షోలో కర‌ణ్ జోహార్ గుట్టు ర‌ట్ట‌యింది. అతడిని ఎఫైర్ గురించి ప్ర‌శ్నించిన జాన్వీ క‌పూర్‌కి దిమ్మ‌తిరిగే రిప్ల‌య్ అందింది. తాను 26 వ‌య‌సులో క‌న్య‌త్వాన్ని కోల్పోయాన‌ని, క‌పూర్ కుటుంబ వ్య‌క్తితో ఇంటిమేట్ అయ్యాన‌ని క‌ర‌ణ్ జోహార్ వ్యాఖ్యానించారు. అయితే క‌ర‌ణ్ అలా వ్యాఖ్యానించిన‌ప్పుడు జాన్వీ క‌ళ్లు పెద్ద‌వి అయ్యాయి. ఆశ్చ‌ర్య‌పోతూ దీనిని న‌మ్మ‌లేను అన్న‌ట్టుగా అత‌డి వైపు చూసింది.

మీకు బ్యాడ్ నేమ్ తెచ్చేది ఏది? క‌నీసం ఒక అబ‌ద్ధం అయినా చెప్పండి..! అని జాన్వీ క‌ర‌ణ్ ని ప్ర‌శ్నిచింది. కానీ అత‌డి నుంచి ఇలాంటి వైల్డ్ ఆన్స‌ర్ వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. అయితే కరణ్ వెంటనే త‌న ప్ర‌క‌ట‌న‌ను స‌వ‌రిస్తూ.. నేను ఆ పార్టీకి ఆలస్యంగా వచ్చాను.. మీ కుటుంబంలోని ఎవరితోనూ నేను సన్నిహితంగా ఉండ‌టం కుద‌ర‌లేదు.. కానీ ఆ స‌మ‌యంలో ఆ ఆలోచన నా మనసులోకి రెండుసార్లు వచ్చింది!అంటూ చాలా గొణిగాడు. మొత్తానికి క‌పూర్ కుటుంబంలో క‌ర‌ణ్ వ‌ల‌చిన రాకుమారి ఎవ‌రై ఉంటారు? అంటూ నెటిజ‌నులు ఆరాలు తీస్తున్నారు.

క‌ర‌ణ్ జోహార్ త‌న శిష్యురాలైన జాన్వీకి ఇలాంటి షాకిస్తాడ‌ని అనుకోలేదు. ఈ షోలో జాన్వి త‌న అందాన్ని మెరుగుప‌రుచుకునేందుకు గతంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని, కానీ తన తల్లి మార్గదర్శకత్వంలోనే జరిగిందని వెల్లడించింది.

Tags:    

Similar News