• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాంతారా 2.. టార్గెట్...

కాంతారా 2.. టార్గెట్ ఫిక్స్ అయినట్లే..

| ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి కాంతారా 2 సినిమాపై చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-07-27 05:05 GMT

కన్నడ నాట అత్యంత భారీ బడ్జెట్ తో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కాంతారా 2. బ్లాక్ బస్టర్ మూవీ కాంతారాకి ప్రీక్వెల్ గా ఈ చిత్రం రెడీ అవుతోంది. మొదటి సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అందుకుంది. దీంతో కాంతారా 2 పైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో ఇది కూడా ఉందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి కాంతారా 2 సినిమాపై చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నారు. మొదటి పార్ట్ కంటే బెస్ట్ ఇవ్వాలని అద్భుతమైన కథని చెప్పడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే కాంతారా ఫ్రీక్వెల్ కథని అతను చెప్పబోతున్నారు. ఈ మూవీ కంటెంట్ కూడా చాలా రిచ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అద్భుతమైన కథాంశంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ని ఈ మూవీలో రిషబ్ శెట్టి ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం.

హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం విశేషం. మొదటి సినిమా ద్వారా వచ్చిన ప్రాఫిట్ లో మెజారిటీ ఈ కాంతారా 2 కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ చిత్రంలో గ్రాండ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంతారా 2 చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారంట.

పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. కాంతారా 1 మొదటిగా కన్నడంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత ఇతర భాషలలో డబ్బింగ్ చేసి కాస్త.ఆలస్యంగా విడుదల చేశారు. అయితే కాంతారా 2 చిత్రాన్ని మాత్రం అన్ని భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే శాండిల్ వుడ్ నుంచి రాకింగ్ స్టార్ యష్ తర్వాత మరో పాన్ ఇండియా హీరో వచ్చినట్లు అవుతుంది.

ఈ చిత్రం తర్వాత రిషబ్ శెట్టి ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోవడం గ్యారంటీ. ఇప్పటికే సౌత్ లో బడా ప్రొడ్యూసర్స్ నుంచి అతనికి ఆఫర్స్ వస్తున్నాయి. కాంతారా 2 తర్వాత తర్వాత రిషబ్ శెట్టి చేయబోయే ఏ సినిమా అయిన కూడా యూనివర్సల్ కాన్సెప్ట్ తోనే ఉండే అవకాశం ఉంది. అయితే హీరోగా చేస్తూనే దర్శకుడుగా కొనసాగుతారా లేదంటే ఇతర డైరెక్టర్స్ తో వర్క్ చేస్తారా అనేది వేచి చూడాలి.

Tags:    
  • Kantara2 
  • Kantara 
  • Sandlewood 
  • Rishabshetty 
  • Filmindustry 
  • Panindiaproject 
  • Hombalefilms 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS