కాంతారా చాప్టర్ 1లో ప్రభాస్ సర్ ప్రైజ్..?
కాంతారా చాప్టర్ 1 లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ప్రీక్వెల్ కథ కాంతారా కన్నా భారీగా ఉండబోతుంది.;
రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 వస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో కష్టపడి రిషబ్ శెట్టి తెరకెక్కించారు. అక్టోబర్ 2 సరిగ్గా విజయదశమి రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి తన నటనతో ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఐతే ఈ ప్రీక్వెల్ లో మరోసారి తన మార్క్ నటనతో అదరగొట్టేలా ఉన్నారు.
సినిమాలో ప్రభాస్ క్యామియో..
కాంతారా చాప్టర్ 1 లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ప్రీక్వెల్ కథ కాంతారా కన్నా భారీగా ఉండబోతుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ బజ్ క్రియేట్ చేసింది. ఐతే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 లో ప్రభాస్ కూడా ఉంటాడట. అదేంటి ప్రభాస్ సినిమాలో ఏదైనా క్యామియో చేశాడా లేదా వాయిస్ ఓవర్ ఏమైనా ఇచ్చాడా అంటే.. కాంతారా చాప్టర్ 1 లో ప్రభాస్ నటించలేదు.. వాయిస్ ఓవర్ ఇవ్వలేదు.
ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజా సాబ్ ట్రైలర్ కాంతారా చాప్టర్ 1 తో వస్తుంది. అంటే దసరాకి ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో కాంతారా చాప్టర్ 1 ప్రదర్శించే అన్ని సెంటర్స్ లో రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. సో కాంతారా 1 చూడాలని వెళ్లిన ఆడియన్స్ కి ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ ట్రీట్ కూడా ఉండబోతుంది.
థమన్ మ్యూజిక్ హైలెట్..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. రాజా సాబ్ కి థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. సో కాంతారా ఫ్యాన్స్ కి ప్రభాస్ ట్రైలర్ కూడా సర్ ప్రైజ్ చేయబోతుంది.
రాజా సాబ్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ లాక్ చేశారు. సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి, రవితేజ, శర్వానంద్ సినిమాలు వస్తున్నాయి. వాటికి రాజా సాబ్ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ఇక కాంతారా ఒక డివోషనల్ కథతో వస్తుంది. ఈ ప్రీక్వెల్ లో రిషబ్ శెట్టి ఇంకా డెప్త్ గా కథ కథనాలు చెప్పబోతున్నారని తెలుస్తుంది. కాంతారా లో కాదు ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్ మైండ్ లో గుర్తుండిపోయేలా చేస్తాయట. సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అని అంటున్నారు.