ప్రభాస్ కోసం కన్నప్ప వెయిటింగ్!

అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.

Update: 2024-05-05 09:41 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో దిగ్గజ నటులు యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పాపులర్ యాక్టర్ శరత్ కుమార్, కామెడీ కింగ్ బ్రహ్మానందం తో పాటు ఎందరో ప్రముఖులు నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప మూవీ షూటింగ్‌ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్.. తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. ఇక అక్షయ్ రోల్ షూటింగ్ పూర్తి కావడంతో.. నెక్స్ట్ సెట్స్ లోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వనున్నారా అని నెట్టింట అంతా అడుగుతున్నారు.

నిజానికి తన చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నా.. విష్ణు కోరిక మేరకు కన్నప్ప ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్. ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తారని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత అందుకు ఆయన ఒప్పుకోలేదని టాక్ వచ్చింది. నందీశ్వరుడి రోల్ చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చారట. అందుకే అక్షయ్ కుమార్ ను విష్ణు రంగంలోకి దించినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్నప్ప చిత్రంలో శివుడిగా అక్షయ్ కనిపించనున్నారని తెలుస్తోంది.

Read more!

ఇక ప్రభాస్.. తన రోల్ కోసం మూడు రోజుల పాటు షెడ్యూల్ లో పాల్గొంటే సరిపోతుందట. అందుకు ప్రభాస్ తొలుత ఏప్రిల్ మధ్యలో డేట్స్ కేటాయించారని తెలిసింది. ఆ తర్వాత మే ఫస్ట్ వీక్ లో సెట్స్ లో అడుగుపెడతానని చెప్పారని సమాచారం. కానీ ఆయన ఎంట్రీ ఇవ్వకపోవడంతో మేకర్స్.. అక్షయ్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారట. అయితే మే నెలలో తన షూటింగ్ పార్ట్ ను ఎలా అయినా కంప్లీట్ చేస్తానని ప్రభాస్ హామీ ఇచ్చినట్లు టాక్.

మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కన్నప్ప సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. కన్నప్ప పాత్రలో ఎంతో అంకిత భావంతో నటిస్తున్న మంచు విష్ణు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News