మంచు హీరో నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?
రిజల్ట్ ఏదైనా సరే కన్నప్ప సినిమాతో మంచు విష్ణు చేసిన సందడి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే మంచు హీరో ప్రయత్నానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది.;
రిజల్ట్ ఏదైనా సరే కన్నప్ప సినిమాతో మంచు విష్ణు చేసిన సందడి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే మంచు హీరో ప్రయత్నానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. చాలా రోజుల తర్వాత తన మీద ఒక అటెన్షన్ వచ్చేలా చేసుకున్నాడు మంచు విష్ణు. అందుకే కన్నప్ప తర్వాత విష్ణు చేసే సినిమాపై అందరి దృష్టి ఉంది. సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా కూడా మంచు విష్ణు తన ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.
శ్రీను వైట్లతో ఢీ సీక్వెల్..
మోసగాళ్లు, జిన్నా సినిమాల తర్వాత మంచు విష్ణు కన్నప్పతో జోష్ తెచ్చుకున్నాడు. ఇక నెక్స్ట్ ఆయన చేసే సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. అసలైతే శ్రీను వైట్లతో ఢీ సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉన్నా ఎందుకో అది సెట్స్ మీదకు వెళ్లట్లేదు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మరీ పక్కన పెట్టారు. ఐతే కన్నప్ప ఇచ్చిన పుష్ తో తప్పకుండా మంచు విష్ణు నెక్స్ట్ అటెంప్ట్ కూడా బెటర్ అనిపించేలా ఉంటుందని అనిపిస్తుంది.
వరుస ఫ్లాపులతో కెరీర్ లో వెనకపడ్డ మంచు విష్ణు కన్నప్పతో బజ్ తెచ్చాడు. అందుకే ఇప్పుడు మళ్లీ కెరీర్ తొలినాళ్లలో ఎలా అయితే కథల వేట చేశాడో అలా కథల కోసం సర్చ్ చేస్తున్నాడట. తన ఇమేక్ కి తగినట్టుగా కామెడీ, యాక్షన్, ఎంటర్టైనర్ ఇలా ఏదైనా చేసేద్దాం అన్న ఉత్సాహంతో ఉన్నాడట మంచు విష్ణు.
మోహన్ బాబు కూడా నాని ది ప్యారడైజ్ లో..
ఓ విధంగా మంచు విష్ణుకి ఇప్పుడు మంచి అవకాశమని చెప్పొచ్చు. యువ హీరోలు కూడా డిఫరెంట్ కథలతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నప్పతో మంచు విష్ణు ప్రయత్నాన్ని మెచ్చుకున్న ఆడియన్స్ ఈ టైంలోనే ఇంకా ఎక్స్ పెరిమెంట్ కథలు చేస్తే తిరిగి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి మంచు హీరో ఆ ప్రయత్నాలు కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.
మంచు విష్ణు నెక్స్ట్ సినిమాకు కాంబినేషన్ అనౌన్స్ మెంట్ తోనే మంచి క్రేజ్ ఉంటుంది. సో అందుకే మంచు హీరో కూడా ఈసారి కమర్షియల్ గా కూడా అదరగొట్టే సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి ఫైనల్ గా మంచు విష్ణు ఓకే చెప్పే డైరెక్టర్ ఎవరవుతారన్నది చూడాలి.
ఓ పక్క మోహన్ బాబు కూడా నాని ది ప్యారడైజ్ లో విలన్ గా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆయన రోల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్. మంచు మనోజ్ కూడా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమాలు చేస్తున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాల్లో మనోజ్ కంబ్యాక్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. మొన్నటిదాకా ఫ్యామిలీ ఇష్యూస్ తో హాట్ టాపిక్ గా ఉన్న మంచు ఫ్యామిలీ హీరోలు ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడం మంచు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.