శత్రువులు అంటూ స్టార్ హీరోని చిక్కుల్లోకి నెట్టిన కంగన
కొన్నేళ్లుగా సినీపరిశ్రమలో శత్రుత్వాన్ని పెంచుకున్న నటిగా కంగన రనౌత్ అగ్రెస్సివ్ నేచుర్ గురించి అందరికీ తెలుసు.
కొన్నేళ్లుగా సినీపరిశ్రమలో శత్రుత్వాన్ని పెంచుకున్న నటిగా కంగన రనౌత్ అగ్రెస్సివ్ నేచుర్ గురించి అందరికీ తెలుసు. ఎటు చూసినా శత్రుత్వం పెరగడంతో సైలెంట్ గా రాజకీయల్లోకి జంప్ అయింది. అక్కడ ఉంటూనే సినిమాలు కూడా నడిపించేస్తోంది. అయితే ఇప్పుడు తనలాగే రణ్ వీర్ సింగ్ కి కూడా శత్రువులు పెరిగారని అంటోంది కంగన. శత్రువులు పెరిగితే స్థాయి పెరిగినట్టేనని కితాబిచ్చింది!! డాన్ 3 వివాదంలో రణ్ వీర్ ని హీరోని చేయడానికి కంగన ప్రయత్నిస్తోంది కానీ.. క్వీన్ మద్ధతు అతడికి కలిసొస్తుందా? వికటిస్తుందా? అనేదే సందిగ్ధం!
ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం `డాన్ 3` నుండి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూఐసిఇ) ఆయనపై నాన్-కోఆపరేషన్ (సహాయ నిరాకరణ) ఆదేశాలు జారీ చేయడం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రణ్‌వీర్‌కు మద్దతుగా నిలవగా.. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ఈ అంశంపై స్పందించారు. రణ్‌వీర్ సింగ్‌కు పూర్తి అండగా నిలిచిన కంగనా, సినీ కార్మిక సంఘాల నిషేధాల సంస్కృతిని ఉద్దేశించి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాను నటించిన `భారత్ భాగ్య విధాత` సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాన్ని ప్రస్తావించారు. ``గతంలో నన్ను కూడా అందరూ నిషేధించారు (బ్యాన్ చేశారు). జీవితంలో మీ స్థాయి, సక్సెస్ హోదా పెరిగినప్పుడు.. శత్రువులు కూడా పెరుగుతారు. ఎనిమీ పెరగకుండా మీ హోదా పెరగడం అనేది అసాధ్యం. కాబట్టి రణ్‌వీర్ సింగ్ దీనిని చూసి భయపడకుండా పరిశ్రమలో తన స్థాయి ఎక్కడికి చేరిందో తానెంతటి ఉన్నత స్థానాన్ని సాధించాడో అర్థం చేసుకోవాలి`` అని కంగనా హితవు పలికారు.
విజయం సాధించినప్పుడు శత్రువులు పెరగడం సహజమని.. రణ్‌వీర్ తన కెరీర్‌లో సాధించిన అద్భుతమైన విజయాల గురించి ఆలోచించుకోవాలని సూచించారు. జీవితంలో ఒక వ్యక్తి ముందుకు సాగుతున్నప్పుడు అనేక అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతాయని.. ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగదని కంగనా చెప్పుకొచ్చారు. నేను కూడా నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులను, నిషేధాలను ఎదుర్కొన్నాను.. అయినా ఇప్పటికీ నేను బాగానే ఉన్నాను. ఇలాంటివి పెద్దగా పట్టించుకోవద్దు..కాలక్రమేణా అన్నీ సర్దుకుంటాయి! అంటూ రణ్‌వీర్ సింగ్‌కు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు.
అయితే రణ్ వీర్ పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఫెడరేషన్ ఇంతకుముందే ప్రకటించింది. అసోసియేషన్ తో రణ్ వీర్ సమస్యలో నిర్మాతల గిల్డ్ మధ్యవర్తిత్వం వర్కవుటైంది. ప్రస్తుతానికి వివాదం సద్ధుమణిగింది. కానీ ఫర్హాన్ తో సమస్యను వందశాతం పరిష్కరించుకునేందుకు రణ్ వీర్ ప్రయత్నించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో శత్రుత్వం అంటూ కంగన పెద్ద తేనెతుట్టనే కదిపింది. అనవసరంగా ఇది రణ్ వీర్ కి చేటు చేయకూడదని ఆశిద్దాం.
ఇక కంగనా రనౌత్ తదుపరి చిత్రం విషయానికి వస్తే.. అరడజను ఫ్లాపుల తర్వాత క్వీన్ ప్రధాన పాత్రలో నటించిన `భారత్ భాగ్య విధాత` చిత్రం 12 జూన్ 2026న థియేటర్లలో విడుదల కానుంది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో సినిమా ఇది. ఆ క్లిష్ట సమయంలో హాస్పిటల్ సిబ్బంది ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాల కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మనోజ్ తపాడియా రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కంగనా తన సొంత బ్యానర్ `మణికర్ణిక ఫిల్మ్స్` పతాకంపై నిర్మించగా... గిరిజా ఓక్, స్మితా తాంబే కీలక పాత్రలు పోషించారు.