ముసలి వెంట్రుకలు వస్తే ఛాన్సివ్వరా? కంగన దబాయింపు!
అయితే దీనికి విరుద్ధంగా క్వీన్ కంగన రనౌత్ దబాయింపు ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశమైంది.;
యూత్ ని థియేటర్లకు రప్పించాలంటే, తెర నిండుగా గ్లామర్ వండాలి. ఉరకలెత్తే వయసు మిసమిసలు వేడెక్కిస్తుంటే, బెడ్ రూమ్, బాత్రూమ్ సన్నివేశాల్లో గ్లామరసం పండించే యవ్వనశిరులు రోమాంచిత సన్నివేశాల్లో రెచ్చిపోతే జనాన్ని థియేటర్లకు రప్పించడం పెద్ద కష్టమేమీ కాదు! అయితే ఇవన్నీ ఉన్నా, మంచి కథ, కథనం, నటీనటులు, మ్యూజిక్ ఇలా చాలా కుదరాలి.
అయితే దీనికి విరుద్ధంగా క్వీన్ కంగన రనౌత్ దబాయింపు ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఏదో ఇలా బాలమెరుపులు వస్తుంటే, కాస్త తల వెంట్రుకలు పండితే సినిమాల్లో అవకాశాలివ్వరా? అని దబాస్తోంది కంగన. అయినా వయసు చూసి ఎవరైనా అవకాశాలిస్తారా? వయసుకు తగ్గ కథలు, స్క్రిప్టులు మలిచే సంస్కృతి మన పరిశ్రమకు ఎప్పుడు అలవాటవుతుంది? అంటూ సూటిగా ప్రశ్నించింది. ఇంకా పాత చింతకాయ పద్ధతులనే అవలంబిస్తూ ఇంకెన్నాళ్లు? అని మన ఫిలింమేకర్స్ ని నిలదీసింది. ఒకవేళ వయసు మీరిన నటీమణులకు అవకాశం కల్పించకపోతే అది మన ఇరుకు మనస్తత్వాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చేస్తుందని కంగన ఫుల్ గా క్లాస్ తీస్కుంది.
అంతేకాదు.. కంగన ఎలాంటి దాపరికాలు లేకుండా తన పండిన జుత్తును ఓపెన్ గా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ముసలాళ్లు అయిపోతున్నామని కలత చెందడం కాదు.. వారి వృద్ధిని కాంక్షించాలని కూడా సెలవిచ్చింది. సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలని, మార్పును ప్రేరేపించాలనుకుంటే అది వృద్ధాప్య సమావేశాలకు మించి, అన్ని వయసుల మహిళలకు అర్ధవంతమైన పాత్రలను అందించాలి.. అంటూ క్లాస్ తీస్కుంది క్వీన్.
అన్నట్టు వయసు మీరుతున్నా విద్యాబాలన్, జ్యోతిక, నయనతార, త్రిష లాంటి నటీమణులకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలో అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు కదా మన దర్శకులు. మాధురి, దివంగత శ్రీదేవి వంటి వారి కోసం కొన్ని పాత్రల్ని మన దర్శకరచయితలు క్రియేట్ చేసారు కదా? దానిని మర్చిపోయి ఇప్పుడిలా కంగన ఎందుకు ఆవేదన చెందుతున్నట్టు?