వారణాసి కోసం కాంచి.. రాజమౌళి ప్లానింగ్ తోనే..?

ఐతే కీరవాణి తమ్ముడు కాంచి కూడా ఆడియన్స్ కు సుపరిచితమే. అమృతం సీరియల్ ద్వారా ఆయన చాలా పాపులారిటీ సంపాదించారు.;

Update: 2025-11-17 11:30 GMT

రాజమౌళి సినిమా అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం యూనిట్ లో జాయిన్ అవుతారు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు జక్కన్న తన ప్రతి సినిమా విషయంలో ఫ్యామిలీని పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తాడు. వాళ్లకి తగిన వర్క్ ఇచ్చి సినిమాకు సపోర్ట్ చేసేలా చూస్తాడు. ఈ క్రమంలోనే కీరవాణి సతీమణి శ్రీవల్లికి ప్రొడక్షన్ డిజైన్, రమ కి కాస్టూమ్స్, కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్షన్ తో పాటు టెక్నిషియన్స్ ని చూసుకోవడం, ఇక కీరవాణికి మ్యూజిక్, కళ్యాణి మాలిక్ కీరవాణి మ్యూజిక్ కి సపోర్ట్ చేస్తుంటాడు. సింహా, కాళ భైరవ కూడా సినిమా లో ఏదో ఒక విభాగంలో పనిచేస్తారు.

అమృతం సీరియల్ లో కాంచి..

ఐతే కీరవాణి తమ్ముడు కాంచి కూడా ఆడియన్స్ కు సుపరిచితమే. అమృతం సీరియల్ ద్వారా ఆయన చాలా పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ చేశారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు రైటర్ కమ్ డైరెక్టర్ గా కూడా చేశారు. రైటర్ గా మర్యాద రామన్నకు కథ అందించిన కాంచి మళ్లీ ఇన్నాళ్లకు రాజమౌళి తో కథా చర్చల్లో పాల్గొన్నారని తెలుస్తుంది.

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమాకు స్టోరీ డిస్కషన్ లో కాంచి ముఖ్య పాత్ర పోషించారని తెలుస్తుంది. అంతేకాదు కథను సిద్ధం చేయడంలో ఆయన సపోర్ట్ కూడా ఉందట. ఇతిహాసాల మీద మంచి పట్టు ఉన్న కాంచి వారణాసి కథలో తను పూర్తిస్థాయి ఇన్వాల్వ్ మెంట్ చూపించారట. అందుకే రాజమౌళి వారణాసి స్టోరీ క్రెడిట్స్ లో విజయేంద్ర ప్రసాద్ తో పాటు కాంచికి స్థానం కల్పించారు.

వారణాసితో అతనికి ఒక బ్రేక్..

రాజమౌళి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. కానీ ఈసారి కాంచిని కూడా రంగంలోకి దించారు. ఐతే కాంచి కథలు రాస్తాడని తెలిసినా వారణాసితో అతనికి ఒక బ్రేక్ ఇచ్చి.. అతనికి సెపరేట్ కెరీర్ ప్లాన్ చేసే భాగంలోనే రాజమౌళి ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే వారణాసి రైటర్ అంటే కాంచికి నెక్స్ట్ మంచి డిమాండ్ ఉంటుంది. అలా బ్రదర్ కెరీర్ ని ట్రాక్ లోకి తెచ్చేలా చేస్తున్నాడు జక్కన్న.

సరే ప్లానింగ్ ఎలా ఉన్నా వారణాసి రైటర్ గా కాంచికి మంచి క్రేజ్ రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అసలు వారణాసి ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. తప్పకుండా ఈ సినిమా తర్వాత కాంచి కూడా బిజీ రైటర్ గా వరుస ఛాన్స్ లు అందుకుంటారేమో చూడాలి. వారణాసి గ్లింప్స్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీగా ఉన్నారు. రాజమౌళి గ్లోబ్ త్రొట్టర్ అంటూ టైం త్రొట్టర్ కథతో వస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో రాముడిగా మహేష్ అని చెప్పిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

Tags:    

Similar News