ఆ క్రేజీ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేనా?
అలాంటి కాంబినేషన్లు సెట్ అయినప్పుడు ఆ ప్రాజెక్టులకు క్రేజ్ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడలాంటి ఓ కాంబినేషనే సెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.;
సినీ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని కాంబినేషన్లు ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి కాంబినేషన్లు సెట్ అయినప్పుడు ఆ ప్రాజెక్టులకు క్రేజ్ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడలాంటి ఓ కాంబినేషనే సెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ మరియు డిఫరెంట్ జానర్ సినిమాలు తీసే వెట్రిమారన్.
వెట్రిమారన్ డైరెక్షన్ లో కమల్
వీరిద్దరిదీ చాలా రేర్ కాంబినేషన్. తన యాక్టింగ్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న కమల్ నుంచి ఆఖరిగా థగ్ లైఫ్ అనే మూవీ వచ్చింది. కానీ ఆ సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అయితే ఇప్పుడాయనకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. వెట్రిమారన్ డైరెక్షన్ లో కమల్ ఓ సినిమా చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
వెట్రిమారన్ కు పలు భాషల్లో మంచి క్రేజ్
సినిమా సినిమాకీ వేరియేషన్స్ చూపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే వెట్రిమారన్ కు కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వెట్రిమారన్ దర్శకత్వంలో లోకనాయకుడు హీరోగా సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ ఈ విషయమై చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు.
అరసన్ సినిమాతో బిజీగా వెట్రిమారన్
రీసెంట్ గా వెట్రిమారన్ కమల్ ను కలిసి ఓ కథ చెప్పారని అంటున్నారు. కాగా ప్రస్తుతం వెట్రిమారన్ శింబు హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వడ చెన్నై యూనివర్స్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. మరి అరసన్ తర్వాత వెట్రిమారన్ చేయబోయే సినిమా కమల్ తోనేనా లేదా ఈ వార్త కేవలం రూమరేనా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఖరారైతే మాత్రం అనౌన్స్‌మెంట్ తోనే మూవీకి మంచి హైప్ ఏర్పడే అవకాశముంది.