త్రిష‌తో లిప్ లాక్ అయితే ఇంకా ఫీల‌య్యేవారేమో!

సీన్ డిమాండ్ చేసిందంటే? విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఎంత‌కైనా తెగిస్తారు. ఆయ‌న‌కు మ‌ణిర‌త్నం తోడైతే ఆ విధ్వంసం ఆప‌డం అసాధ్యం. 30 ఏళ్ల క్రితం నాయ‌కుడితో సంచ‌ల‌నం అయ్యారు.;

Update: 2025-05-18 10:00 GMT

సీన్ డిమాండ్ చేసిందంటే? విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఎంత‌కైనా తెగిస్తారు. ఆయ‌న‌కు మ‌ణిర‌త్నం తోడైతే ఆ విధ్వంసం ఆప‌డం అసాధ్యం. 30 ఏళ్ల క్రితం నాయ‌కుడితో సంచ‌ల‌నం అయ్యారు. మ‌ళ్లీ 30 ఏళ్ల త‌ర్వాతా అలాంటి సంచ‌ల‌నానికే తెర తీసారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి కాంబినేష‌న్ లో 'థ‌గ్ లైఫ్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్రం ట్రైల‌ర్ కొన్ని గంట‌ల క్రిత‌మే రిలీజ్ అయింది.

ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. అయితే ఇదే ట్రైల‌ర్ లో క‌మ‌ల్ హాస‌న్-అభిరామి మ‌ధ్య లిప్ లాక్ కూడా అతే హైలైట్ అవుతుంది. సినిమాలో ఇలాంటి స‌న్నివేశాలు స‌హ‌జం. అందులోనూ క‌మల్ ఇలాంటి విష‌యాల్లో ఏమాత్రం మోహ‌మాట ప‌డే న‌టుడు కాదు. స‌న్నివేశం ర‌క్తిక‌ట్టించ‌డం కోసం కాంప్ర‌మైజ్ అయ్యే టైపు కాదు. అక్క‌డ సీన్ డిమాండ్ చేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌ణిర‌త్నం లిప్ లాక్ వేయించారు. అభిరామి ఆ స‌న్నివేశంలో చెల‌రేగింది.

అయితే ఈ లిప్ లాక్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 40 ఏళ్ల న‌టితో 70 ఏళ్ల వ‌య‌సులో క‌మ‌ల్ లిప్ లాక్ వేయాలా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. లిప్ లాక్ లేకుండా న‌టించకూడ‌దా? అంటూ క‌సుబుసు లాడుతున్నారు. ప్ర‌తిగా క‌మ‌ల్ అభిమానులు కూడా వాటికి ధీటైన బ‌ధులిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ కి-అభిరామికి లేని అభ్యంత‌రం మీకెందుకంటూ? కౌంట‌ర్ ఎటాక్ కి దిగారు.

అదే లిప్ లాక్ త్రిష‌తో వేస్తేఇంకా హార్ట్ అయ్యేవారేమో. 70 ఏళ్ల క‌మ‌ల్ లిప్ లాక్ వేసే స‌రికి కొంద‌రికి అసూయ‌గా ఉన్న‌ట్లుంది అంటూ మండిప‌డుతున్నారు. సినిమాని సినిమాగా చూడ‌టం మానేసి అర్దం లేని విమ‌ర్శ‌లు అవ‌స‌ర‌మా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయినా క‌మ‌ల్ సినిమాల్లో లిప్ లాక్ లు స‌హ‌జం. వాటి గురించి రాద్దాంతం అన‌వ‌స‌ర‌మైన‌దిగా క‌మ‌ల్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News