ఒకటి మురిపించే.. మరొకరి బెడిసికొట్టే

హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కళ్యాణి ప్రియదర్శన్. పేరుకు ఈ అమ్మడు మలయాళ భామ.;

Update: 2025-08-30 16:58 GMT

హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కళ్యాణి ప్రియదర్శన్. పేరుకు ఈ అమ్మడు మలయాళ భామ. కానీ తెరంగేట్రం చేసింది మాత్రం టాలీవుడ్ తోనే. హలో తర్వాత, సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో సినిమాతో విజయం అందుకుంది. ఇక శర్వానంద్ రణరంగం సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆమె తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు.

ఇక తన సొంత భాష మలయాళంలో కళ్యాణి బిజీ అయిపోయింది. ఈ వారం ఈమెకు స్పెషల్ గా నిలిచిపోయింది. ఒక రోజు గ్యాప్ లో కళ్యాణి నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి, లోక చాప్టర్ 1 చంద్ర. ఇది సూపర్ హీరో జానర్ లో తెరకెక్కిన ఫాంటసీ డ్రామా. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ టాక్ కూడా డీసెంట్ గా ఉంది. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది అంటూ విశ్లేషకులు పేర్కొన్నారు.

తెలుగులోనూ ఈ సినిమాకు బాగానే ఆదరణ వస్తోంది. నిన్న రాత్రి నుంచే షో లు పడుతున్నాయి. మంచి టాక్ రావడంతో డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదు అవుతుంది. టైటిల్ మాత్రం కొత్త లోక అని పెట్టి, ప్రేక్షకులకు అర్థం కానట్లు పెట్టినా... టికెట్లు బాగానే తెగుతున్నాయి. ఈ వీకెండ్ లో స్ట్రైట్ సినిమాలను కాదని, మరీ ఈ కొత్త లోక సినిమానే తొలి ఛాయస్ అయ్యింది.

ఇక మరో సినిమా ఒదుమ్ కుతిరా చాదుమ్ కుతిరి. దీని అర్థం.. పరిగెత్తే గుర్రం ఎగిరే గుర్రం అని. పుష్ప సినిమా విలన్ ఫాహద్ ఫాసిల్ ఇందులో హీరో. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న ఒక కుర్రాడి జీవత కథే సినిమా స్టోరీ. కానీ దర్శకుడి ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ సినిమా భరించలేని తలనొప్పిగా, టార్చర్ గా ఉందని క్రిటిక్స్ ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు.

ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఇలాంటి ఏమీ లేకుండానే ఏదో తూతు మత్రంగా సన్నివేశాలతో ప్రేక్షకుల సహనం పరీక్షించారని అంటున్నారు. ఇలా రెండు భారీ అంచనాలతో, ఒకే సమయంలో వచ్చిన సినిమాలు ఒకటి బెడిసి కొట్టగా, మరొకటి మాత్రం మురిపించింది.

Tags:    

Similar News