• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి.. డార్లింగ్...

కల్కి.. డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కచ్చే గుడ్ న్యూస్

| కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా ఫ్యాన్ మీట్ ఒకటి చిత్ర యూనిట్ ఏర్పాటు చేయబోతుందంట. ప్రభాస్ కి గ్రీటింగ్ చెప్పేందుకు గాను ఈ ఫ్యాన్స్ మీట్ ఉండబోతోందని తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-05-13 04:19 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898ఏడీ. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి మూవీ రాబోతోంది.

ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలని స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యింది. వాటికి సంబందించిన ప్లానింగ్ ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. కచ్చితంగా సినిమాని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి డిఫరెంట్ స్ట్రాటజీలతో ప్రమోషన్స్ ని డిజైన్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కి సంబందించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.

కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా ఫ్యాన్ మీట్ ఒకటి చిత్ర యూనిట్ ఏర్పాటు చేయబోతుందంట. ప్రభాస్ కి గ్రీటింగ్ చెప్పేందుకు గాను ఈ ఫ్యాన్స్ మీట్ ఉండబోతోందని తెలుస్తోంది. నెక్స్ట్ వీక్ నుంచి ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ పార్టిసిపేట్ చేస్తాడంట. ఫ్యాన్స్ కి నేరుగా ప్రభాస్ ని కలిసే అవకాశం వస్తే కచ్చితంగా ఎగిరిగంతేస్తారు.

ముఖ్యంగా డై హార్డ్ ఫ్యాన్స్ ని ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ ఎంపిక చేయనుందని తెలుస్తోంది. త్వరలో ఫ్యాన్స్ మీట్ కి సంబందించిన పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందంట. కల్కి ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా నేషనల్ మీడియాకి సైతం స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు చేస్తోంది. ముఖ్యంగా కల్కి కథాంశం ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని తెరక్కించిన నేపథ్యంలో దానిని పబ్లిక్ లోకి రీచ్ అయ్యేలా చేయాలని అనుకుంటున్నారంట.

కచ్చితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించారు. దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్ ని ఏమైనా బ్రేక్ చేస్తుందా అనేది వేచి చూడాలి.

Tags:    
  • Kalki2898ad 
  • Prabhas 
  • Darlingfans 
  • Kalkipromotions 
  • Nagashwin 
  • Vyjanthimovies 
  • Amitabhbachchan 
  • Kamalhasan 
  • Deepikapadukone 
  • Dishapatani 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS