'కల్కి 2' మొదలైతే రెండున్నరేళ్లు సెట్స్ లోనే!
తాజాగా నిర్మాణ వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం ఏంటంటే? కల్కి 2 షూటింగ్ రెండున్నరేళ్ల పాటు ఉంటుందంటున్నారు.;
'కల్కి 2' ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. అందుకు కారణం ప్రభాస్ బిజీ షెడ్యూల్ ఒకటైతే? 'కల్కి 2' భారీ స్పాన్ ఉన్న కథ కావడంతో? చిత్రీకరణకు ఎక్కువ సమయంపడుతుం దన్నది మరో కారణం. మరి ఈ సినిమాకు మోక్షం ఎప్పుడు అంటే? ప్రభాస్-నాగ్ అశ్విన్ బలంగా సంక ల్పించినప్పుడే సాధ్యమవుతుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా? రెండు...మూడు సినిమాలకు సమానంగా ఉంటుందని నాగీ ధీమా వ్యక్తం చేసాడు.
అంటే ఒకేసారి రెండు..మూడు సినిమాలు కలిపి సాధిస్తే వచ్చే విజయం కల్కి 2 ఒక్క హిట్ తోనే సాధ్యమన్నది నాగీ ఉద్దేశం. తాజాగా నిర్మాణ వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం ఏంటంటే? కల్కి 2 షూటింగ్ రెండున్నరేళ్ల పాటు ఉంటుందంటున్నారు. సెట్స్ కి వెళ్లిన తర్వాత నిర్విరామంగా చిత్రీకరణ చేస్తే అంత సమయం పడుతుందంటున్నారు. మధ్యలో బ్రేక్ లు ఇస్తూ షూట్ చేస్తే అంతకు మించిన సమయం పడుతుందని చెబుతున్నారు.
అలాగే ప్రభాస్ కూడా 'కల్కి 2' మొదలైతే గనుక మరో సినిమా షూటింగ్ చేసే సమయం కూడా ఉండదం టున్నారు. పూర్తిగా ఈ సినిమాకు బాండ్ అయిన పనిచేస్తే తప్ప రెండున్నరేళ్లలో పూర్తి చేయడం కష్టమం టున్నారు. రెండు న్నరేళ్లు గాక సీజీ వర్క్ కోసం అదనంగా ఎనిమిది నెలలు సమయం పడుతుందం టున్నారు. అందుకే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడంలో జాప్యం జరుగుతుందంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ఇప్పటికిప్పుడు పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి.' పౌజీ' సెట్స్ లో ఉంది. దీని తర్వాత 'స్పిరిట్' మొదలవుతుంది. అనంతరం 'సలార్ 2' పట్టాలెక్కుతుంది. ఇవి పూర్తవ్వడానికే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. మధ్యలో మళ్లీ డార్లింగ్ కొత్త సినిమాలంటూ ఎలాంటి ట్విస్టులు ఇవ్వకుండా ఉంటే వీటి తర్వాత 'కల్కి 2' మొదలవుతుంది. లేదంటే ఇంకా సమయం పడుతుంది.