ప్రభాస్ కి బాస్ గా లేడీ సింగమా?
ఎట్టకేలకు `స్పిరిట్` పట్టాలెక్కింది. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రభాస్ సహా ప్రధాన పాత్రలన్నీ షూటింగ్ లో పాల్గొంటున్నాయి.;
ఎట్టకేలకు `స్పిరిట్` పట్టాలెక్కింది. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రభాస్ సహా ప్రధాన పాత్రలన్నీ షూటింగ్ లో పాల్గొంటున్నాయి. కానీ సందీప్ వంగా ఏ పాత్రకు ఎలాంటి నటుడ్ని ఎంపిక చేసాడు? అన్నది మాత్రం ఇంత వరకూ బయటకు రాలేదు. సందీప్ ఎలాంటి పాత్ర రాసినా అది అంతే బలంగా ఉంటుంది? పాత్రకు తగ్గ సరైన నటుడినే ఎంపిక చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి, సంజయ్ దత్ లాంటి సీనియర్ స్టార్లు కూడా భాగమవుతున్నారనే ప్రచారం ఉంది. కానీ ఇందులో వాస్తవం లేదు. కొరియన్ నటుడు డాన్ లీ తప్ప మరే నటుడి పేరు అధికారికంగా బయటకు రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా `స్పిరిట్` లో బాలీవుడ్ పవర్ పుల్ లేడీ కాజోల్ ని భాగం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆమెను లేడీ పోలీస్ బాస్ గా చూపించబోతున్నాడుట. అవినీతి ఐజీ పాత్ర బాధ్యతలు కాజోల్ కి అప్పగించినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అవినీతి కి పరాకాష్టలా ఆ పాత్రలో కాజోల్ హైలైట్ అవుతుందని అంటున్నారు. పర్పెక్ట్ పోలీస్ యాటిట్యూడ్ ఉన్న నటి ఎవరని? వెతకగా కాజోల్ తారస పడినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంత వరకూ డార్లింగ్ యూనిఫాం ధరించలేదు.
చాలా సినిమాల్లో యాక్షన్ స్టార్ గా హైలైట్ అయ్యాడు. అలాంటింది పోలీస్ కథలో అతడి యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకే అందదు. అయితే సినిమాలో అతడి పాత్ర పోలీస్ వ్యవస్థకు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది? అన్నది చూడాలి. కాజోల్ ని ఐజీ పాత్రలో దించడం నిజమే? అయితే ప్రభాస్ రోల్ ఆమె కింద ఉంటుంది? లేదా సరి సమాన పాత్ర అయినా అవ్వొచ్చు. ఇలాంటి పాత్రల్లో కాజోల్ ఒదిగిపోతారని చెప్పాల్సిన పనిలేదు. కాజోల్ సెకెండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ రేట్ మిగతా సీనియర్ల కంటే బాగుంది. ఆమె లో యారోగెన్సీ, యాటిట్యూడ్ ఇలాంటి పాత్రలకు కలిసొస్తాయి.
`రఘువరన్ బిటెక్ లో రియల్ ఎస్టేట్ కార్పోరేట్ కింగ్ పాత్రను ఏ రేంజ్ లో పోషించారో తెలిసిందే. ఆ పాత్ర సక్సెస్ అవ్వడానికి కారణం పాత్రలో యాటిట్యూడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది నటులున్నా? దర్శకుడు వేల్ రాజా సలహా మేరకు దర్శకురాలు సౌందర్యా రజనీకాంత్ ఆమెను ఎంపిక చేసారు. రిలీజ్ తర్వాత ఆ నమ్మకం నిలబడింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కాజోల్ వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ వెబ్ సిరీస్ కూడా కమిట్ అయ్యారు